Ravi Teja: 'ఈగిల్' సంక్రాంతి బరిలోంచి తప్పుకుందా?
ABN , First Publish Date - 2023-11-02T13:40:06+05:30 IST
'టైగర్ నాగేశ్వర రావు' సినిమా ఫ్లాపు అవటంతో రవితేజ తన తదుపరి సినిమా 'ఈగిల్' విడుదల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలని అనుకుంటున్నట్టుగా వుంది. అందుకే ఆ సినిమా సంక్రాంతి పోటీలో కాకుండా, తన పుట్టినరోజు అయిన జనవరి 26న విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టుగా సాంఘీక మాధ్యమంలో వార్త వైరల్ అవుతోంది.
రానున్న సంక్రాంతి పండగకి చిత్ర పరిశ్రమ నుండి చాలా సినిమాలు పోటీలో వున్నాయి. మహేష్ బాబు (MasheshBabu), త్రివిక్రమ్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram సినిమా ఈ సంక్రాంతి కి పెద్ద సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటు, నాగార్జున (AkkineniNagarjuna) నటిస్తున్న 'నా సామి రంగా' #NaaSaamiRanga, వెంకటేష్ (VenkateshDaggubati) నటిస్తున్న 'సైంధవ' #Saindhava సినిమా కూడా వున్నాయి. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ (VijayDeverakonda), పరశురామ్ పెట్ల (ParasuramPetla) కాంబినేషన్ లో వస్తున్న 'ఫామిలీ స్టార్' #FamilyStar కూడా వుంది.
వీటన్నితో పాటు ఫాంటసీ సినిమా 'హనుమాన్' #Hanu-Man కూడా సంక్రాంతి పండగకి విడుదలవుతోంది అని చెప్తున్నారు. ఇందులో తేజ సజ్జ కథానాయకుడు కాగా ప్రశాంత్ వర్మ (PrashanthVarma) దర్శకుడు. ఇన్ని సినిమాలతో పాటు రవితేజ (RaviTeja) నటించిన 'ఈగిల్' #Eagle సినిమా కూడా సంక్రాంతి కి విడుదల అని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 'ఈగిల్' సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోనుంది అని వార్త. ఇదే వార్త సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది. ఈ సినిమా సంక్రాంతి పండగకి కాకుండా, జనవరి 26న, రవి తేజ పుట్టినరోజు నాడు విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. కానీ చిత్ర నిర్వాహకుల నుండి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. రవితేజ తాజా సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడటంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని, అందుకని అన్ని సినిమాల మధ్యలో తన సినిమా ఎందుకని ఆలోచిస్తున్నట్టు ఒక వార్త నడుస్తోంది.
అదీ కాకుండా 'ఈగిల్' సినిమా ఒక యాక్షన్ సినిమా అని, అందుకని పండగనాడు ప్రేక్షకులు కొంచెం వినోదాత్మకంగా వుండే సినిమాలు చూస్తారని, అందువలన సినిమా జనవరి 26కి రావటమే కరెక్టు అని రవితేజ అనుకుంటున్నట్టుగా సమాచారం. చిత్ర నిర్వాహకులు, రవితేజ కలిసి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు.