Tiger Nageswara Rao: హిందీలో రవితేజ డెబ్యూ సినిమా డిజాస్టర్
ABN , First Publish Date - 2023-10-23T11:48:34+05:30 IST
రవితేజ చాలా నమ్మకంగా హిందీలో విడుదల చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని అక్కడ ప్రేక్షకులు పట్టించుకోలేదు. తన పాత్రకి హిందీలో స్వంత గొంతు కూడా ఇచ్చాడు, కానీ ఆ సినిమా నాలుగు రోజులకి కలెక్టు చేసిన రెవిన్యూ చాలా తక్కువ. ఇది హిందీ లో తన డెబ్యూ సినిమాగా భావించాడు, కానీ...
రవితేజ (RaviTeja) తాజాగా 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వంశీ (Vamsee) దీనికి దర్శకుడు, అభిషేక్ అగర్వాల్ (AbhishekAgarwal) నిర్మాత. ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా విడుదలైంది. రవితేజ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాతో అతను హిందీలోకి కూడా ఆరంగేట్రం చేసినట్టుగా భావించారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ కి అతని స్వంత గొంతు ఇవ్వడమే కాకుండా, ఈ సినిమా కోసమని ముంబై వెళ్లి అక్కడ కొన్ని రోజులు వుండి విపరీతమైన ప్రచారం కూడా చేశారు. తెలుగులో కూడా అంత ప్రచారం చెయ్యలేదు అని అంటున్నారు.
కంటెంట్ బాగుంటే, ప్రచారం లేకపోయినా ఎక్కడైనా ఆడుతుంది అని 'పుష్ప' #Pushpa సినిమా ఇంతకు ముందే నిరూపించింది. అలాగే కన్నడ సినిమా 'కాంతారా' #Kantara కూడా అలాగే నిరూపించింది. కానీ పాపం రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు' సినిమా తెలుగులో కన్నా, హిందీలోనే ఎక్కువ ప్రచారం చేసినా కూడా అక్కడ ఈ సినిమాని ఎవరూ పట్టించుకోక పోవటం ఆసక్తికరం.
ఈ సినిమాలో కథానాయకుడు అయిన నాగేశ్వర రావు ఒక దొంగ. అతను అందరికి చెప్పి మరీ దొంగతనాలు చేస్తాడు అని ప్రతీతి అని చెప్పారు. కానీ అతను ఎలా దొంగతనం చేసాడో మాత్రం సినిమాలో చూపించలేకపోయారు అని క్రిటిక్స్, ప్రేక్షకులు అంటున్నారు. అదీ కాకుండా ఈ సినిమా నిడివి మూడుగంటలకి పైగా ఉండటం, అందులో విషయం లేకపోవటం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవటానికి మూల కారణం అని అంటున్నారు. ఇందులో నుపుర్ సనన్ (NupurSanon), గాయత్రీ భరద్వాజ్ (GayatriBharadwaj) కథానాయికలుగా నటించారు. అనుపమ్ ఖేర్ (AnupamKher), నాజర్ (Nasser) లాంటి సీనియర్ నటులు కూడా వున్నారు. హిందీలో నాలుగు రోజులకు గాను సుమారు రూ. 60 లక్షలు కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్స్ చాలా డ్రాప్ అయిపోయాయి అని కూడా చెపుతున్నారు.
ఇది కూడా చదవండి:
Tiger Nageswara Rao film review: ఈ సినిమా చూడటానికి ఓపిక ఉండాలి