RashmikaMandanna: ఈ సినిమాలో విజయ్ పక్కన ఆమె చెయ్యాల్సిందిట, కానీ మేనేజర్...

ABN , First Publish Date - 2023-07-18T17:22:19+05:30 IST

నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ పక్కన ఇంకో తెలుగు సినిమాలో నటించాల్సి ఉండగా, ఆమె మేనేజర్ ఆమెకి వ్యతిరేకంగా పని చేసినట్టుగా ఒక కథనం నడుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..

RashmikaMandanna: ఈ సినిమాలో విజయ్ పక్కన ఆమె చెయ్యాల్సిందిట, కానీ మేనేజర్...
Rashmika Mandanna

ఆమధ్య దర్శకుడు పరశురామ్ (Parasuram), విజయ్ దేవరకొండ (VijayDeverakonda) తో ఒక సినిమా అధికారికంగా లాంచ్ అయింది. దిల్ రాజు (DilRaju) ఈ సినిమాకి నిర్మాత. అయితే ఇందులో 'సీతా రామం' #SitaRamam ఫేమ్ మృణాల్ ఠాకూర్ (MrunalThakur) కథానాయకురాలిగా చేస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఏమి పెట్టలేదు కానీ దీనిని విడి13 (VD13) గా పిలుస్తున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఒకటి వుంది. మృణాల్ ఠాకూర్ కన్నా ముందుగా ఈ సినిమాకి ఎవరిని కథానాయకురాలిగా అనుకున్నారో తెలుసా? నేషనల్ క్రష్ #NationalCrush అని పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న (RashmikaMandanna). ఆమె ఈ సినిమా చేయాల్సి ఉండగా, ఆమె పారితోషికం ఎక్కువ ఉంటుంది, ఆమె హిందీలో కూడా బిజీ గా వుంది, తెలుగు సినిమా చేస్తే లేట్ అయిపోతుంది, అని స్వయానా ఆమె మేనేజర్ ఆమెని తప్పించి మృణాల్ ఠాకూర్ కి ఛాన్స్ ఇప్పించాడని తెలిసింది. ఇద్దరికీ ఒకరే మేనేజర్ గా పని చేస్తున్న కారణంగా రష్మిక కి బదులు మృణాల్ ని ప్రమోట్ చేసాడని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

rashmikamandanna6.jpg

దీనికన్నా ముందు ఇంకో సినిమా కూడా విజయ్ దేవరకొండ పక్కన ఇంకో హీరోయిన్ ని పెట్టుకున్నారు, దానికి కూడా రష్మిక మందన్న పేరు ప్రతిపాదనకు వస్తే ఆమె మేనేజర్ ఆమెని వద్దని చెప్పాడు అని ఇంకో టాక్. ఇలా రెండు మూడు సినిమాలకు, తన మేనేజర్ వేరే నటీమణులను ప్రమోట్ చెయ్యడానికి తనను వెనక్కి నెడుతున్నదని గ్రహించిన రష్మిక మేనేజర్ ని మార్చటం లో ఇదొక కారణం అని కూడా అంటున్నారు. మేనేజర్ ఇలాంటివి చెయ్యడం వలెనే, ఇప్పుడు తెలుగు సినిమాలలో చాలా సినిమాలు శ్రీలీల (Sreeleela) చేస్తోంది, అలాగే ఒక్కసారిగా మృణాల్ సేన్ పేరు కూడా బాగా వినపడుతోంది.

Updated Date - 2023-07-18T17:22:19+05:30 IST