RashmikaMandanna: తెలుగు సినిమా చెయ్యడానికి రష్మిక దగ్గర డేట్స్ లేవంట, ఆమె ప్లేస్ లో ఎవరొచ్చారో తెలుసా...

ABN , First Publish Date - 2023-07-13T10:16:29+05:30 IST

ఈరోజు నేషనల్ క్రష్ అని పిలుస్తున్న రష్మిక మందన్న కి ఇంతపేరు వచ్చిందంటే అందుకు కారణం తెలుగు సినిమాలు. 'చలో' సినిమాతో ఆరంగేట్రం చేసి 'పుష్ప' సినిమాతో ప్రపంచం అంతా మారుమోగింది రష్మిక పేరు, కానీ ఆమె ఇప్పుడు తెలుగు సినిమా చెయ్యడానికి డేట్స్ లేవని ఆ సినిమా నుండి తప్పుకుంది అన్న వార్త వైరల్ అయింది.

RashmikaMandanna: తెలుగు సినిమా చెయ్యడానికి రష్మిక దగ్గర డేట్స్ లేవంట, ఆమె ప్లేస్ లో ఎవరొచ్చారో తెలుసా...
Rashmika Mandanna

రష్మిక మందన్న (RashmikaMandanna) కన్నడ నటి, తెలుగుకి 'చలో' #Chalo అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. కన్నడంలో అప్పటికే సినిమాలు చేసినా, రష్మిక కి ఆ ఒక్క తెలుగు సినిమాతో ఒక్కసారిగా పేరొచ్చింది, స్టార్ అయిపొయింది. 'చలో' సినిమాకి దర్శకుడు వెంకీ కుడుముల (VenkyKudumula), అతనే రష్మిక ని తెలుగు తెరకి పరిచయం చేసాడు. ఆ తరువాత రష్మిక కన్నడ సినిమాలు చెయ్యటమే మానేసింది. ఇక తెలుగులో ఆమె అగ్రనటీమణుల్లో ఒకరు అయిపొయింది. ఆ తరువాత 'పుష్ప' #Pushpa సినిమా విడుదల అయింది కదా, ఆ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ #NationalCrush అని అందరూ పిలుస్తున్నారు.

Rashmika-mandanna.jpg

సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించి, అల్లు అర్జున్ (AlluArjun) పక్కన నటించిన ఈ కన్నడ భామ, ఆ సినిమాలో 'సామి సామి' #SaamiSaami పాటకు అందరూ ఊగిపోయారు. తమిళంలో కూడా తన హవా కొనసాగించింది. ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా బిజీ అయిపొయింది. మరి ఇంకేమి తెలుగు సినిమాలకి ఆమె డేట్స్ దొరకటం కష్టం అవుతోంది అని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers), నితిన్ (Nithiin), రష్మిక మందన్న, దర్శకుడు వెంకీ కుడుములతో ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు, దానికి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయని కూడా చెప్పారు. ప్రచార చిత్రాలు కూడా విడుదల చేశారు.

Sreeleela (8).jpg

అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే, రష్మిక మందన్న ఆ సినిమా చెయ్యడం లేదు అని, ఎందుకంటే ఆమె ఈ తెలుగు సినిమాకి తన డేట్స్ సరిపోవటం లేదట. ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకుంటున్నారు అంటే, ఇంకెవరు తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు వున్న ఏకైక నటి ఎవరంటే శ్రీలీల (Sreeleela). ఈమె ఆ సినిమాలో రష్మిక బదులు వచ్చింది అని వార్త. మరి శ్రీలీల ఇప్పటికే మూడు షిఫ్ట్స్ లో చాలా సినిమాలు చేస్తోంది. మరి ఈ నితిన్ సినిమాకి ఎలా డేట్స్ ఇస్తుందో చూడాలి. ఇప్పటికే వక్కంతం వంశి (VakkanthamVamsi) సినిమాలో శ్రీలీల, నితిన్ చేస్తున్నారు. మన తెలుగు దర్శకులు, నిర్మాతలు ఒక నటి హిట్ అయితే ఆమె వెంటే పడతారు. ఇప్పుడు వేరే కథానాయికలు లేనట్టు శ్రీలీల పేరే వినపడుతోంది. ఆమె నితిన్ సినిమా ఒప్పుకుంటే ఆమె చేతిలో ఇప్పటికి ఒక డజను సినిమాలు వున్నట్టే.

ఇప్పటికే ఆమె మహేష్ బాబు (MaheshBabu) తో సినిమా, పవన్ కళ్యాణ్ (PawanKalyan) తో, అల్లు అర్జున్ తో, బాలకృష్ణ (NandamuriBalakrishna) సినిమాలో ఇలా చాలామంది అగ్రనటులతో ఇప్పటికే షూటింగ్ చేస్తోంది.

Updated Date - 2023-07-13T10:16:29+05:30 IST