Devi Sri Prasad: పెళ్లి ఫిక్సయిందా? ఆ అమ్మాయేనా?
ABN , First Publish Date - 2023-04-04T13:43:02+05:30 IST
ఇప్పుడు దేవిశ్రీ వయస్సు 43 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో పెళ్లంటే చాలు.. మాట దాట వేస్తున్న ఈ రాక్‌స్టార్ పెళ్లికి అన్నీ సిద్ధమైనట్లుగా.. అమ్మాయి ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ (Most Eligible Bachelors) లిస్ట్‌లో నుంచి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) బయటికి వచ్చేస్తున్నాడా? ఇంకెప్పుడు పెళ్లి? అని అనే వారందరి నోటికి తాళం వేయబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే కోలీవుడ్ సర్కిల్స్‌లో వినబడుతున్నాయి. గతంలో పలుమార్లు దేవిశ్రీ ప్రసాద్‌కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఒకసారి హాట్ బ్యూటీ, నటిగా, నిర్మాతగా పేరొందిన ఛార్మీని (Charmi) పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ (Poojitha Ponnada) పేరు వినిపించింది. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దేవిశ్రీ వయస్సు 43 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో పెళ్లంటే చాలు.. మాట దాట వేస్తున్న ఈ రాక్‌స్టార్ (Rockstar) పెళ్లికి సంబంధించి ఇప్పుడు మరోసారి వార్తలు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నాయి.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇప్పుడాయన పెళ్లి చేసుకోబోయేది సెలబ్రిటీని (Celebrity) కాదు. ఎందుకంటే, దేవిశ్రీ విషయంలో హీరోయిన్ల పేర్లు, సింగర్స్ పేర్లు అలా వినిపించాయి కాబట్టి.. ఇప్పుడు కూడా ఆయన ఏ సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నాడో? అనేలా అంతా అనుకోవడం సహజమే. కానీ కోలీవుడ్ మీడియా (Kollywood Media) రాస్తున్న వార్తల ప్రకారం.. ఆయన మనువాడపోయే అమ్మాయి సెలబ్రిటీ కాదని, బంధువుల అమ్మాయి అని తెలుస్తోంది. దేవిశ్రీకి దూరపు బంధువు అవుతుందని, వరసకు మరదలు అవుతుందని అంటున్నారు. అంతే కాదు, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 17 సంవత్సరాలు ఉంటుందని కూడా ప్రస్తుతానికైతే వార్తలు వినవస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.
Read Also-Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్
ఇక దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు ఇండస్ట్రీలో (Cine Industry) పెళ్లి చేసుకోవాల్సిన సెలబ్రిటీల లిస్ట్ చాలానే ఉంది. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Young Rebel Star Prabhas) పెళ్లి వార్త కోసం ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ప్రభాస్‌ని పెళ్లి ఎప్పుడని అడిగితే.. సల్మాన్ (Salman) ఇంకా అలానే ఉన్నాడుగా! అని మాట దాట వేస్తుంటారు. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా నిరాశగా ఉన్నారు. అన్నీ కలిసొస్తే.. ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి వార్త కూడా వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి వార్తకి సంబంధించి మాత్రం వార్తలు గట్టిగానే వినబడుతున్నాయి. ఈసారి తూచ్ అనడానికి ఆస్కారం లేకుండా.. ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. త్వరలోనే నిశ్చితార్థ కార్యక్రమాలు కూడా జరపనున్నారట. అయితే అధికారికంగా మాత్రం దేవిశ్రీ పెళ్లికి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటనా బయటికి రాలేదు. (Devi Sri Prasad Marriage)
ఇవి కూడా చదవండి:
*********************************
*SamanthaRuthPrabhu: నాగ చైతన్య, శోభిత డేటింగ్ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన సమంత
*Rashmika Mandanna: ‘రెయిన్‌బో’.. రష్మికకు ప్రమోషన్
*Deepika Padukone: దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?