MegaStar Chiranjeevi: చిరంజీవి, డీజే టిల్లు కాంబినేషన్ సినిమా కథ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు
ABN , First Publish Date - 2023-06-03T18:35:01+05:30 IST
చిరంజీవి, డీజే టిల్లు ఇద్దరూ కలిపి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు కాగా చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మాత. అయితే ఈ సినిమా మలయాళం సినిమా 'బ్రో డాడీ' కి రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది తప్పు వార్త అని, ఇది ఒరిజినల్ కథ అని, దీన్ని ఒక టాప్ రైటర్ దగ్గర తీసుకున్నారని, ఇంతకీ ఎవరా రైటర్, ఆ వివరాలు చదవండి.
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), డీజే టిల్లు అనబడే సిద్ధూ జొన్నలగడ్డ (SiddhuJonnalagadda) లీడ్ యాక్టర్స్ గా కళ్యాణ్ కృష్ణ (KalyanKrishna) దర్శకత్వంలో ఒక సినిమా రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల (SushmithaKonidela) నిర్మిస్తున్న సంగతి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి చాలా వార్తలు వచ్చాయి. అందులో ప్రధానంగా ఈ సినిమా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ (MohanLal), పృథ్వి రాజ్ సుకుమారన్ (PrithvirajSukumaran) నటించిన 'బ్రో డాడీ' (BroDaddy) సినిమాకి రీమేక్ అని, ఆ మలయాళం సినిమా హక్కులు తీసుకొని చిరంజీవి ఇంకో రీమేక్ అధికారికంగా చేస్తున్నారని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే ఆలా అనుకోవడానికి చాలా ఆస్కారం వుంది, ఎందుకంటే చిరంజీవి, డీజే టిల్లు అంటే తండ్రీ కొడుకులుగా వేస్తున్నారు కాబట్టి ఆ 'బ్రో డాడీ' సినిమా అనుకునే ఛాన్స్ వుంది. కానీ ఈ సినిమా 'బ్రో డాడీ' సినిమా ఎంతమాత్రం కాదని ఈ యూనిట్ సభ్యుల తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ఇది తెలుగు కథ అని, ఇందులో కూడా చిరంజీవి, డీజే టిల్లు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని తెలిసింది.
ఇంతకీ మరి ఈ సినిమా కథ ఎవరిదీ, ఎవరు రాశారు? అంటే అది రవితేజకి (RaviTeja) 'ధమాకా' #Dhamaka లాంటి హిట్ కథ ఇచ్చిన బెజవాడ ప్రసన్న కుమార్ (BezawadaPrasannaKumar) కథ అని తెలిసింది. ఈ కథ ప్రసన్న తనే దర్శకత్వం వహించి, ముందుగా ఒక చిన్న బడ్జెట్ సినిమా తీద్దామని అనుకున్నాడు అని తెలిసింది. అయితే ఈ కథ ఆ నోటా ఈ నోటా చాలామంది నిర్మాతల దగ్గరికి వెళ్ళింది, అందరూ ఈ కథ చాలా సూపర్, ఎవరు చేసిన హిట్ అవుతుంది అన్నారు. ఆలా అందరి నోటా విన్న ఈ కథ ఒకసారి సుష్మిత దగ్గర కూడా ప్రసన్న కుమార్ చెప్పాడని, విన్న వెంటనే సుష్మిత చాలా ఎక్సయిట్ అయి, ఈ కథ నేను తీసుకుంటాను అని వెంటనే అతని దగ్గర కథ తీసుకున్నారని తెలిసింది.
ఆలా తీసుకున్న కథకి వెంటనే చిరంజీవి, డీజే టిల్లు లను ఫిక్స్ చేసుకొని, దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ ని కూడా తీసుకున్నారు. ఈ కథలో చాలా భాగం తండ్రీ కొడుకుల మీదే నడుస్తుందని, ఇది ఒక హిలేరియస్ కథ అని, చిరంజీవి ఈ కథ తీసుకోవటంతో ఈ సినిమా ఇప్పుడు హై బడ్జెట్ మూవీ అవ్వబోతోందని తెలిసింది. అయితే చిత్ర నిర్వాహకులు ఎందుకో మరి ప్రసన్న కుమార్ కథ అని మాత్రం బయటకి పొక్కకుండా చేశారు. అందుకనే ఇది అందరూ మలయాళం సినిమాకి రీమేక్ అని అనుకుంటున్నారు.