Chiranjeevi: మెగా అల్లుడు చాలా క్లియర్ గా చెప్పేసాడు... తాను మెగా అల్లుడు కానని...

ABN , First Publish Date - 2023-06-19T11:10:25+05:30 IST

ఈమధ్య విడాకుల గురించిన వార్తలు చెప్పాలంటే సెలబ్రిటీస్ ఒక విచిత్ర పద్ధతి ఎన్నుకుంటున్నారు. డైరెక్ట్ గా చెప్పకుండా, ఒకరికొకరు అన్ ఫాలో అవటం, ఫోటోలు డిలీట్ చెయ్యడం లాంటి చర్యల ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు మెగా కుటుంబంలో నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, చిరంజీవి కుమార్తె శ్రీజ ఇద్దరూ అదే విధంగా తమ విడాకుల సంగతి బయట ప్రపంచానికి తెలియచేసారు.

Chiranjeevi: మెగా అల్లుడు చాలా క్లియర్ గా చెప్పేసాడు... తాను మెగా అల్లుడు కానని...
Mega Star Chiranjeevi

మెగా కుటుంబంలో (MegaFamilY) పెళ్లిళ్లు, విడాకులు ఇలాంటి వార్తలతో కొంచెం ఇబ్బందిగానే వుంటున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే ఆమధ్య మెగా బ్రదర్ నాగబాబు (Konidela Nagababu) కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) తన భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagedda) కి విడాకులు ఇచ్చేసింది అనే వార్త మొత్తం అందరికీ తెలిసింది. ఆమె సాంఘీక మాధ్యమాల్లో అతని ఫోటోస్ డిలీట్ చెయ్యడం, అతను కూడా ఆమెవి తీసెయ్యడం మొదటి సూచనగా పబ్లిక్ కి చెప్పడం అయితే, నిహారిక ఒక వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సల్స్' (DeadPixels) లో వేసిన పాత్ర, ఆమె బోల్డ్ మాటలు చెప్పటం రెండో సూచన అయితే, ఇక మూడో సూచన కొన్ని రోజుల క్రితం జరిగిన తన అన్న నిశ్చితార్ధమే.

వరుణ్ కొణిదెల (VarunKonidela), లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) ల నిశ్చితార్ధ వేడుకలో నిహారిక ఒక్కర్తే కనిపించింది, చైతన్య కనిపించలేదు. దానితో అందరికీ తేట తెల్లం అయింది, వాళ్లిద్దరూ విడిపోయారని. అయితే కొణిదెల కుటుంబం కానీ, అటు జొన్నలగెడ్డ కుటుంబం కానీ దాని మీద అధికారికంగా ఇంతవరకు ప్రకటన ఇవ్వలేదు. కానీ ఇద్దరూ విడిపోయారని ప్రపంచానికి తెలుసు వారి చర్యల బట్టి అని అందరూ అనుకుంటున్నారు.

chiranjeevi-sreeja.jpg

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ (SrijaKonidela) మొదటి భర్తకి విడాకులు ఇచ్చి, రెండో సారి కళ్యాణ్ దేవ్ (KalyanDhev) ని చేసుకుంది. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా వుంది. అయితే మరి ఏమయిందో ఏమో తెలియదు కానీ, ఉన్నట్టుండి ఒకరోజు శ్రీజ తన సాంఘీక మాద్యమాల్లోంచి కళ్యాణ్ దేవ్ ఫోటోలు తీసేసింది. ఇంకా శ్రీజ రెండో భర్తకి కి విడాకులు ఇచ్చేసింది అని అనుకున్నారు, కానీ చిరంజీవి కుటుంబం దాని గురించి ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.

niharikak1.jpg

అయితే నిన్న తండ్రుల దినం (Father'sDay) సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన సాంఘీక మాధ్యమాల్లో కూతురుతో వున్న ఫోటోలు పోస్ట్ చేస్తూ, వారంలో నాకు నీతో వున్న ఈ నాలుగు గంటలు ఎంతో అమూల్యమైనవి అని అన్నాడు. దీనితో వీళ్లిద్దరి వివాహం మీద వున్న అపోహలు కూడా తొలగిపోయాయి. అంటే కళ్యాణ్ దేవ్ అధికారికంగా ఇప్పుడు చిరంజీవి మాజీ అల్లుడు అయిపోయాడు అనే కదా అర్థం వచ్చింది అని అంటున్నారు. దీని మీద నెటిజన్స్ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగా కుటుంబం ఈ ఇద్దరు విడాకుల గురించి ఏమైనా అధికారికంగా ప్రకటన ఇస్తారేమో చూడాలి. లేదా ఎలాగు అందరికి తెలిసింది కాబట్టి, ఇలా వదిలేస్తే మంచిది అని ఊరుకున్నా ఊరుకోవచ్చు అని కూడా కొందరు అంటున్నారు.

Updated Date - 2023-06-19T15:04:23+05:30 IST