Lokesh Kanagaraj: టాలీవుడ్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

ABN , First Publish Date - 2023-01-07T17:26:20+05:30 IST

విక్రమ్ (Vikram) సినిమాతో అన్ని ఇండస్ట్రీల చూపును తన వైపు తిప్పుకొన్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). ఈ చిత్రం భారీ విజయం సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

Lokesh Kanagaraj: టాలీవుడ్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

విక్రమ్ (Vikram) సినిమాతో అన్ని ఇండస్ట్రీల చూపును తన వైపు తిప్పుకొన్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). ఈ చిత్రం భారీ విజయం సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. లోకేశ్ ప్రస్తుతం ఇళయదలపతి విజయ్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ సినిమా పట్టాల మీద ఉండగానే లోకేశ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది.

Allu-Arjun.jpg

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో లోకేశ్ కనక రాజ్ సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియాలో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘దళపతి 67’, ‘ఖైదీ 2’ ల మూవీ షూటింగ్స్ పూర్తి కాగానే అల్లు అర్జున్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని సమాచారం. లోకేశ్ ఈ రెండు ప్రాజెక్టులను తెరకెక్కించేలోపు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2) ను పూర్తి చేస్తాడని తెలుస్తోంది. లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం విజయ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ పూర్తి కాగానే కార్తి‌తో ‘ఖైదీ 2’ ను పట్టాలెక్కిస్తాడు. ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్ స్క్రిఫ్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తాడట. లోకేశ్ గతంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, జయం రవిలతో పని చేస్తాడని వదంతులు షికార్లు కొట్టాయి. కానీ, ఈ హీరోల డేట్స్ ఖాళీగా లేవు. అందువల్ల ఇప్పటి వరకు సినిమాలను ప్రకటించలేదు. కొన్ని రోజుల క్రితం లోకేశ్ కనకరాజ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పదేళ్ల వరకు షెడ్యూల్ బిజీగా ఉందన్నాడు. అల్లు అర్జున్‌తో సినిమా గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు. ఈ తరుణంలో బన్నీతో మూవీ చేయాలంటే లోకేశ్‌కు కొంచెం కష్టమే.

Updated Date - 2023-01-07T17:31:44+05:30 IST