SaiDharamTej: తేజు, సతీష్ ల మధ్య అసలేం జరిగింది...
ABN , First Publish Date - 2023-06-03T13:36:07+05:30 IST
సాయి ధరమ్ తేజ్ కి అతని మేనేజర్ సతీష్ బొట్టా మధ్య ఏదేదో జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు కథ ఏంటి అంటే, మేనేజర్ సతీష్ కొంచెం ఓవర్ చేసాడని, తేజు మీద అరిచాడని, ఆలా అరిచి నేను లేకపోతే నీకు సక్సెస్ రావటం కష్టం అని చెప్పి వెళ్లిపోయాడని తెలిసింది. దానికి తేజు పోతే పో, మళ్ళీ రాకు అని మేనేజర్ తో గట్టిగా అన్నాడని తెలిసింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతి నటుడికి ఒక మేనేజర్ ఉంటాడు. అతనే ఆ నటుడి డేట్స్, ప్రాజెక్ట్స్ తో పాటు ఇంకా చాలా విషయాలు దగ్గరుండి చూసుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ నటుడికి, మేనేజర్ కి మంచి అవినావ సంబధానాలు ఉంటాయి. చాలామంది నటులకు ఎన్నో సంవత్సరాల నుండి ఇలా మేనేజర్లు వున్నారు, ఆ మేనేజర్లను నటులు కూడా బాగా చూసుకుంటారు కూడా. అయితే ఆయా నటుల వలన మేనేజర్లకు కూడా చాలా లాభాలు ఉంటాయి, అందులో ఆర్ధిక లాభం కూడా ఒకటి అని అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ (తేజు అని పిలుస్తారు) #SaiDharamTej కి అతని మేనేజర్ సతీష్ #SateeshBotta కి మధ్య ఏవో చిన్న చిన్న డిఫరెన్సెస్ రావటం, సతీష్ బయటకి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఇదేదో తేజు కావాలని సతీష్ బొట్టా ని మార్చి వేరే మేనేజర్ ని పెట్టుకున్నాడని టాక్ నడుస్తోంది. ఆ కొత్త మేనేజర్ పేరు కూడా సతీష్ అవటం ఆసక్తికరం. అయితే ఇద్దరు సతీష్ లు తేజుతో 'సుప్రీమ్' #Supreme సినిమా నుండి ట్రావెల్ అవుతున్నవాళ్ళే. ఇద్దరూ తేజుకి బాగా కావలసినవాళ్లు, పరిచయం ఉన్నవాళ్లే. అంతే కానీ, ఒక సతీష్ ని తీసి ఇంకో సతీష్ ని పెట్టుకోవటం ఏమీ లేదు. మామూలుగా ఈ మేనేజర్ లకు పరిశ్రమలో కొంచెం గౌరవం ఇస్తున్నారు అంటే, ఆ నటుడిని చూసి అని గ్రహించాలి. ఇంకా రెండోది ఆ మేనేజర్ ప్రవర్తన కూడా ఉంటుంది. ఇప్పుడు తేజు దగ్గరికి వచ్చేసరికి, సతీష్ బొట్టా తన బాస్ అయిన తేజు కి గౌరవం ఇవ్వాలి, అలాగే ఏదైనా సమస్య ఉంటే మాట్లాడాలి, అంతేగానీ అరవకూడదు.
నీ ఈ విజయలన్నిటికీ కారణం నేనే అంటే, అది కొంచెం విర్రవీగటమే అవుతుంది. ఎందుకంటే మేనేజర్ ప్రాజెక్ట్ తీసుకురావటం వరకే, కథ విని, నచ్చిది చేసేది నటుడే. ఎక్కడయినా అంతే, తేజు విషయంలో కూడా అంతే జరిగింది. తేజుకి ప్రమాదం జరిగిన తరువాత చాలా కాలం రెస్ట్ లో వున్నాడు, ఆ తరువాత 'విరూపాక్ష' #Virupaksha చేసాడు, విజయం సాధించాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సతీష్ బొట్టా కొంచెం ఓవర్ చేసాడని తేజు సన్నిహిత వర్గాలు చెపుతున్నారు. "నేను లేకపోతే అసలు నువ్వు లేవు, నీకింత సక్సెస్ కూడా వచ్చేది కాదు," అని తేజు మీద అరిచినట్టుగా తెలుస్తోంది. మెగా కుటుంబంలో తేజు కే ఎక్కువ సహనం ఉండేది, అలాంటిది తేజు మీద అరిచినా అతను ఊరుకున్నాడు. ఆలా అరవటంతో సరిపెట్టకుండా, నేను వెళ్ళిపోతే నీకు విజయం ఎలా వస్తుందో చూస్తా, అని అరుచుకుంటూ వెళ్లిపోయాడని తెలిసింది. అతంవరకు ఎంతో సహనంగా వున్న తేజు, బయటకి వచ్చి పోతే పో అని అరిచాడని తెలిసింది.
అయితే ఇదంతా ఎందుకు జరిగింది అంటే, 'బ్రో' #Bro సినిమా ప్రొడక్షన్ లో తేజు గీతా ఆర్ట్స్ (GeethaArts) లో పనిచేస్తున్న తనకి తెలిసిన ఒక వ్యక్తిని పెట్టాడు. అయితే అతనికి సతీష్ బొట్టాకి పడదు, ఆ విషయం తేజుకి చెపితే సరిపోయేది, వేరే వ్యక్తిని పెట్టేవాడు తేజు. కానీ ఆలా చెప్పకుండా తేజు మీద సతీష్ అరిచాడని, ఆలా ఎలా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటావ్ అని అరిచాడని సన్నిహితులు చెప్తున్నాడు. ఆ తరువాత సతీష్ వెళ్ళిపోతాను అనడమే, తేజు సరే వెళ్ళిపో అని అరవటం ఇదీ సంగతి అని అంటున్నారు.
ఇప్పుడు ఇదే పరిశ్రమలో ఒక టాకింగ్ పాయింట్ గా మారింది. మేనేజర్ అనేవాడు ఎప్పుడూ బాస్ కి సరైన సమాచారం ఇస్తూ మంచి సలహాలు ఇస్తూ ఉండాలి. అంతే కానీ బాస్ మీద అరిస్తే ఎలా అని అంటున్నారు తేజు సన్నిహితులు. ఈ బొట్టా సతీష్ వెళ్ళిపోగానే, 'సుప్రీమ్' సినిమా నుండి ట్రావెల్ అవుతున్న ఇంకో సతీష్ ని మేనేజర్ గా పెట్టుకున్నాడు తేజు వెంటనే. ఇంతే జరిగింది అని తేజు సన్నిహితులు అంటున్నారు, అంతే కానీ తేజు అతని మేనేజర్ ని తీయలేదు, తనంతట తనే వెళ్ళిపోయాడు అని తెలిసింది. అంతే కానీ, ఇదేదో కులాలకు సంబదించిన విషయం అయితే కానే కాదు అని కూడా తేజు సన్నిహితులు స్పష్టం చేశారు.