Chiru Puri Combo: ఆ వార్తల్లో నిజం లేదు
ABN , First Publish Date - 2023-01-16T21:45:47+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ సంక్రాంతి(Sankranthi)కి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా వచ్చి విజయ దుందుభి మోగిస్తున్నాడు. కలెక్షన్ల పరంగా సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలను బీట్ చేస్తూ.. బాక్సాఫీస్‌కి పూనకాలు
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ సంక్రాంతి(Sankranthi)కి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా వచ్చి విజయ దుందుభి మోగిస్తున్నాడు. కలెక్షన్ల పరంగా సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలను బీట్ చేస్తూ.. బాక్సాఫీస్‌కి పూనకాలు తెప్పిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ పాతకాలం నాటి చిరుని డైరెక్టర్ బాబీ (Bobby Kolli) వెలికి తీయడంతో.. మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆనందానికి అవధులే లేవు. రిపీటెడ్ ఆడియెన్స్‌తో.. మెగా ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానంతో చాలా కాలం తర్వాత థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. మొత్తంగా అయితే ఈ సంక్రాంతి విన్నర్ (Sankranthi Winner) వీరయ్యే అని తేలిపోయింది. ఈ సినిమా తర్వాత చిరు చేస్తున్న తదుపరి సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. మెహెర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో మెగాస్టార్ ‘భోళాశంకర్’ (BholaShankar) గా రానున్నారు. ఇది తమిళ ‘వేదాళమ్’ చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే ‘వీరయ్య’ సక్సెస్ తర్వాత మళ్లీ డైరెక్ట్ తెలుగు చిత్రంతో వస్తేనే బాగుంటుందని మెగా యూనిట్ భావిస్తోందనేలా.. తాజాగా ఇండస్ట్రీలో కొన్ని వదంతులు వైరల్ అవుతున్నాయి.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చేస్తున్న ‘భోళాశంకర్’కు గ్యాప్ ఇచ్చి.. ఈ ప్లేస్‌లో మరో చిత్రానికి చిరు శ్రీకారం చుట్టారనేలా టాక్ మొదలైంది. అదీ కూడా డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతుందని, చిరు కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని మెగా వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇవి కేవలం ఎవరో కావాలని చేసిన రూమరేనని, ప్రస్తుతం ‘వీరయ్య’ సక్సెస్‌ని చిరు ఎంజాయ్ చేస్తున్నారని, ‘భోళాశంకర్’ మినహా.. ఇంకా ఏ ఇతర ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా.. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.