Allu Arjun: ‘పుష్ప: ది రూల్’ ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది.. విషయం ఇదేనా?

ABN , First Publish Date - 2023-02-28T16:11:59+05:30 IST

మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Allu Arjun: ‘పుష్ప: ది రూల్’ ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది.. విషయం ఇదేనా?

మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. పుట్టిన రోజు సందర్భంగా బన్నీ అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింఫ్స్ గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాలి. కానీ, టీజర్‌లోని ఓ డైలాగ్ లీక్ కావడంతో ఆ ఆలోచనను విరామించుకున్నారు. ఈ టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప 2’ టీజర్‌ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం నుంచి త్వరలోనే రానుందట.

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతుంది. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఫహద్ పాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-28T16:12:00+05:30 IST