JrNTR: అందరి దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ పైనే, నెక్స్ట్ ఏంటి?

ABN , First Publish Date - 2023-09-14T13:05:42+05:30 IST

'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించటంతో ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు ఒక కీలక దశకి చేరింది. 'దేవర' సినిమా షూటింగ్ లో బిజీ గా వున్న ఎన్టీఆర్ కొన్ని రోజులు సైమా సినిమా అవార్డుల కోసం దుబాయ్ వెళ్ళాడు. అయితే అతని నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిమీదే అందరి దృష్టి వుంది

JrNTR: అందరి దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ పైనే, నెక్స్ట్ ఏంటి?
Jr NTR

జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు వార్తల్లో వున్నాడు. తన సినిమా 'దేవర' #Devara షూటింగ్ తొందరగా చెయ్యాలన్న ఒత్తిడి, ఇక రెండో ఒత్తిడి గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ (KoratalaSiva) దర్శకత్వం వహిస్తున్న 'దేవర' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక పెద్ద సెట్ వేసిన సంగతి తెలిసిందే, ఈ కథానేపధ్యం ఎక్కువగా సముద్రం ఉంటుంది కాబట్టి, అటువంటి సెట్ ఒకటి వేసినట్టుగా తెలిసింది. అయితే కొన్ని సన్నివేశాల కోసం మాత్రం వైజాగ్ (Vizag) లేదా గోవా బీచ్ లలో షూటింగ్ కొన్ని రోజులు మాత్రం చేస్తారని తెలిసింది.

ఇదిలా ఉంటే 'దేవర' సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడు అనేదానిమీదే ఇప్పుడు అందరి దృష్టి వుంది. ఎందుకంటే ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel) తో ఉంటుంది అని అన్నారు. అయితే అధికారికంగా ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంది అని ప్రకటించినా, ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు అనేది ఇంకా తెలియదు.

Devara.jpg

ఈమధ్యలో 'టాక్సీవాలా', 'శ్యామ్ సింఘా రాయ్' #ShyamSinghaRoy సినిమాలకి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యాన్ (RahulSankrityan), ఎన్టీఆర్ ని కలిసి ఒక కథ నేరేట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక పీరియడ్ డ్రామా అని, ఈ కథ ఎన్టీఆర్ కి కూడా నచ్చిందని, అయితే దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) నిర్మించే అవకాశం వుంది అని కూడా అంటున్నారు.

ఒకవేళ రాహుల్ సాంకృత్యాన్ కథ కనక ఎన్టీఆర్ ఒప్పుకుంటే ఆ సినిమా ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా కన్నా ముందే మొదలు పెట్టవచ్చు అని ఒక వార్త నడుస్తోంది. లేదా రెండు సినిమాలు ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా వున్నట్టుగా తెలుస్తోంది. అలాగే హ్రితిక్ రోషన్ (HrithikRoshan), ఎన్టీఆర్ మల్టీ-స్టార్రర్ హిందీ సినిమా కూడా ఉంటుంది. ఏమైనా కూడా 'దేవర' సినిమా ఎన్టీఆర్ కి ఒక కీలక సినిమా, అది ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా తరువాత ఎలాంటి సినిమా చెయ్యాలి అనేది త్వరలోనే నిర్ణయిస్తాడు అని అంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ కి కొంచెం విరామం ఇచ్చి, కుటుంబంతో సహా దుబాయ్ వెళుతున్నాడు. అక్కడ జరగబోయే సైమా సినిమా అవార్డుల ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నాడు ఎన్టీఆర్.

Updated Date - 2023-09-14T13:05:42+05:30 IST