RGV Vyooham: యూట్యూబ్ కి అయినా పనికొస్తుందా...
ABN , First Publish Date - 2023-12-15T17:46:55+05:30 IST
వర్మ ఇంతకు ముందు కొన్ని యూట్యూబ్ వీడియోల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి పాత్రలు పెట్టి తీసిన లాంటి కంటెంట్ నే మరోసారి ఈ 'వ్యూహం' లో చూపిస్తున్నాడు అని అర్థం అవుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఈ సినిమా, థియేటర్స్ లో కాదు, కనీసం యూట్యూబ్ కి అయినా పనికొస్తుందా అని అనిపిస్తోంది ఆ ట్రైలర్ చూస్తుంటే...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో వున్నారు. కొన్ని రోజుల క్రితం అతను తీసిన 'వ్యూహం' సినిమాకి సెన్సారు సర్టిఫికెట్ ఇవ్వకపోగా, ఈ సినిమాని రివైజింగ్ కమిటీ కి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. అయితే ఇందులో ఎటువంటి కొత్తవి లేవు, అదే యూట్యూబ్ కంటెంట్, ఇంతకు ముందు ఆర్జీవీ తీసిన చిన్న చిన్న యూట్యూబ్ వీడియోల నుండి కొన్ని సన్నివేశాలు ఇందులో చేర్చించినట్టుగా వుంది ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.
ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్, వైస్సార్సీపీ కి చెందిన వ్యక్తి కావటం, అలాగే ఆర్జీవీ కూడా అదే పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా అనుకూలంగా మాట్లాడుతూ, యూట్యూబ్ వీడియోలు చేస్తూ వస్తున్నారు కాబట్టి, ఈ 'వ్యూహం' లో కూడా జగన్ భజన తప్ప ఇంకేమీ ఉండదు అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది.
అలాగే ఆర్జీవీ ఒక యూట్యూబ్ వీడియో విడుదల చేసినా అది ఎలా వైరల్ అవుతుంది అనే విషయం అలోచించి, అందుకోసమని వివిధ రకాలైన వివాదాస్పద మాటలు మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం చాలా దూర దేశం నుంచి ఒక ఫోన్ చేయించా, తన స్నేహితుడు దావూద్ ఇబ్రహీం అని అతని నుండి ఫోన్ చేయించానని చెప్పారు.
ఇది సినిమా అనాలా, యూట్యూబ్ వీడియో అనాలో ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది, ఇది కేవలం వైస్సార్సీపీ మెప్పు కోసం తీసినట్టుగా కనపడుతోంది. ఈ సినిమా కూడా ఇంతకుముందు వర్మ యూట్యూబ్ వీడియోలు తీసినట్టుగా ఇది కూడా సాంఘీక మాధ్యమంలో విడుదల చేసేందుకు పనికొస్తుంది అన్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో అన్ని లైవ్ పాత్రలు వుంటాయని అని చెపుతూనే, మళ్ళీ ఇవన్నీ ఫిక్షన్ అని చెప్పడం ఆర్జీవీ ప్రచారాలు కోరుకుంటున్నారని అర్థం అవుతోంది. వార్తల్లో ఉండటానికి అలాగే ప్రచారం కోసం ఎటువంటి మాటలు అయినా చెప్పడానికి సిద్ధపడే వర్మ తీసే ఈ 'వ్యూహం' సినిమా కనీసం యూట్యూబ్ కి అయినా పనికొస్తుందా అని ఒక చర్చ నడుస్తోంది. అలాగే ఆర్జీవీ ప్రెస్ మీట్ లు కూడా యూట్యూబ్ కంటెంట్ కి బాగా పనికొస్తుంది అని ఎప్పటినుండో వున్న ఒక టాక్.