Varisu-Thunivu: విజయ్‌కు రూ.125కోట్లు, అజిత్‌కు రూ.70కోట్ల రెమ్యూనరేషన్.. భారీగా రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్..

ABN , First Publish Date - 2023-01-08T17:09:33+05:30 IST

సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలవుతుంది. కోలీవుడ్‌లో రెండు చిత్రాలు పండగ బరిలో నిలిచాయి. విజయ్ (Vijay) నటించిన ‘వారిసు’ (Varisu), అజిత్ (Ajith) ‘తుణివు’ (Thunivu) కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి.

Varisu-Thunivu: విజయ్‌కు రూ.125కోట్లు, అజిత్‌కు రూ.70కోట్ల రెమ్యూనరేషన్.. భారీగా రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్..

సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలవుతుంది. కోలీవుడ్‌లో రెండు చిత్రాలు పండగ బరిలో నిలిచాయి. విజయ్ (Vijay) నటించిన ‘వారిసు’ (Varisu), అజిత్ (Ajith) ‘తుణివు’ (Thunivu) కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న విడుదల కాబోతున్నాయి. తెలుగులోను ‘వారసుడు’, ‘తెగింపు’ టైటిల్స్‌తో ఈ మూవీస్ విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కావడంతో నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. అందుకు తగ్గట్టే ఈ చిత్రాలు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. ‘వారిసు’, ‘తుణివు’ విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ఫ్రాఫిట్‌ను మిగిల్చియ్యాని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలపై ఓ లుక్కేద్దామా మరి..

‘వారిసు’ ను రూ. 225కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రెమ్యూనరేషన్‌గా విజయ్‌కు రూ.125కోట్లను చెల్లించారని సమాచారం. ఇతర నటులకు పారితోషికాలను చెల్లించడంతో పాటు సినిమాను రూ. 100కోట్ల బడ్జెట్‌తో రూపొందించారట. ఈ మూవీ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్న లెక్కల ప్రకారం.. తమిళనాడు రైట్స్ రూ.70కోట్లు, కేరళ రైట్స్ రూ.6.5కోట్లు, కర్ణాటక రైట్స్ రూ.8కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 35కోట్లు, హిందీ రైట్స్ రూ.34కోట్లు, ఆడియో రైట్స్ రూ.10కోట్లు, డిజిటల్ రైట్స్ రూ.75కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.57కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ చిత్రం భారీగా రూ. 295కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘వారిసు’ నిర్మాత దిల్ రాజుకు దాదాపుగా రూ. 70కోట్ల లాభం వచ్చినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజే సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. అందువల్ల ఆ లాభాలు మరింత అధికమయ్యే అవకాశం ఉంది.

అజిత్ ‘తుణివు’ ను రూ.160కోట్ల బడ్జెట్‌తో బోనీ కపూర్ నిర్మించాడు. అజిత్‌కు రెమ్యూనరేషన్‌గా రూ.70కోట్లను చెల్లించాడు. ఇతర నటులకు పారితోషికాలను చెల్లించడంతో పాటు సినిమాను రూ. 90కోట్ల బడ్జెట్‌‌తో పూర్తి చేశారు. ‘తుణివు’ ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తమిళనాడు థియేట్రీకల్ రైట్స్ రూ.60కోట్లు, కేరళ రైట్స్ రూ.2.5కోట్లు, కర్ణాటక రైట్స్ రూ.3.6కోట్లు, హిందీ రైట్స్ రూ.25కోట్లు, ఆడియో రైట్స్ రూ.2కోట్లు, తెలుగు రాష్ట్రాల రైట్స్ రూ.1.5కోట్లు, డిజిటల్ రైట్స్ రూ.65కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.25కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.14కోట్లు వచ్చాయని సమాచారం. దాదాపుగా మూవీ రూ.199కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. బోనీ కపూర్‌కు సినిమా విడుదలకు ముందే రూ. 39కోట్ల లాభం వచ్చిందట.

Updated Date - 2023-01-08T17:14:19+05:30 IST