Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..
ABN , First Publish Date - 2023-03-30T08:29:29+05:30 IST
విభిన్న పాత్రలు, వైవిధ్యమైన కథలు చేస్తూ దూసుకువెళుతున్న నటుడు నాని (Nani). వరుస సినిమాలతో దూసుకెళుతున్న నేచురల్ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన విషయం తెలిసిందే.
విభిన్న పాత్రలు, వైవిధ్యమైన కథలు చేస్తూ దూసుకువెళుతున్న నటుడు నాని (Nani). వరుస సినిమాలతో దూసుకెళుతున్న నేచురల్ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆయన మొదటి సారి ‘దసరా’ (Dasara) అనే చిత్రం చేశాడు. ఈ సినిమాలో మొదటిసారి రగడ్ లుక్‌తో ఆక్కట్టుకుంటున్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. ఇంతకుముందే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్‌కి సినీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అందరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇటీవలికాలంలో దక్షిణాది చిత్రాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. మంచి కథ ఉంటే స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులు మంచి వసూళ్లని కట్టబెడతారని ‘కాంతార’ వంటి చిత్రాలు చూస్తే అర్థమైంది. దీంతో నాని సైతం ‘దసరా’ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ తరుణంలోనే.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం గురించి పలువురు నెటిజన్లు తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు. వారేమంటున్నారో చూద్దాం.. (Nani Movie Review)
‘నాని మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదు.. రూ. 100 కోట్లు లోడ్ అవుతున్నాయి’.. ‘ఈ దశాబ్దంలో చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి.. నూతన దర్శకుడి సెన్సేషనల్ కంటెంట్ ఇచ్చాడు. నాని, కిర్తీ సురేశ్ మంచి ఫర్ఫామెన్స్ ఇచ్చారు’.. ‘మొదటి అర్థభాగంలో కాస్తా ల్యాగ్ ఉన్నప్పటికీ తన నటనతో నాని దాన్ని భర్తీ చేశాడు. కొన్ని సన్నివేశాలైతే.. రోమాలు నిక్కబోడుచుకునేలా చేశాయి. సంతోష్ నారాయణ్ బీజీఎం మామూలుగా లేదు’ అని వరుసగా రాసుకొస్తున్నారు. అలాగే.. సినిమా అక్కడక్కడా కొంచెం సాగదీసినట్లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం బావుందని చెబుతున్నారు. నాని మాస్ హిట్ పడ్డట్లేనని చెప్పుకొస్తున్నారు. కాగా.. మరికొందరూ ఏమంటున్నారో చూద్దాం.. (Dasara Movie Review)