Memu Famous Film Review: ఇదో ఓటిటి సినిమా, అంతే !
ABN , First Publish Date - 2023-05-26T09:01:55+05:30 IST
ప్రచారాలతో ఆకట్టుకొని, కొంత నటీనటులతో అందరినీ ఆకట్టుకున్న సినిమా 'మేమ్ ఫేమస్'. దీనికి సుమంత్ ప్రభాస్ దర్శకుడు, కథానాయకుడు కూడా. ఈ సినిమా ఎలా వుంది అంటే...
సినిమా: మేమ్ ఫేమస్
నటీనటులు : సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, సార్య లక్ష్మణ్, మౌర్య చౌదరి, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, శివ నందన్, అంజిమామ తదితరులు
ఛాయాగ్రహణం: శ్యామ్ దూపాటి
సంగీతం: కళ్యాణ్ నాయక్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
కథ, మాటలు, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
-- సురేష్ కవిరాయని
ఈమధ్య చాలామంది కొత్త దర్శకులు కొత్త ఆలోచనలతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఆలా అడుగుపెట్టిన వాడే ఈ యువకుడు సుమంత్ ప్రభాస్ (SumanthPrabhas). 'మేమ్ ఫేమస్' #MemuFamousFilmReview అనే సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా, #MemFamousReview అందులో కథానాయకుడిగా కూడా నటించాడు. ఇంతకు ముందు ఇతను యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, అలాగే మ్యూజిక్ వీడియోలు చేసి పాపులారిటీ సంపాదించాడు. అయితే ఈ 'మేమ్ ఫేమస్' #MemuFamousFilmReview సినిమా ప్రచారాలు అందరినీ విపరీతంగా ఆకట్టుక్కున్నాయి, ఈ అబ్బాయి సినిమా విడుదలకు ముందు తన ఇంటర్వ్యూలతో ఆకట్టుకున్నాడు. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' లాంటి సినిమా తీసిన అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ సినిమాకి నిర్మాతలు. సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) ఈ సినిమా గురించి ప్రశంసించడం కూడా ఈ సినిమా మీద కొంచెం ఆసక్తి లేపింది.
Memu Famous Story కథ:
ఈ కథ ఒక గ్రామంలో జరిగిన ముగ్గురు యువకుల కథ. మయి అలియాస్ మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య ) బాల్యం నుండి స్నేహితులు. ఆ వూర్లో ఈ ముగ్గురూ పనీ పాటా లేకుండా తిరుగుతూ వూళ్ళో ఎదో ఒక గొడవలో ఇరుక్కుంటూ వుంటారు. వీళ్ళ వలన వూరిలో జననాలు వీళ్ళని తిడుతూ ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అని తిడుతూ వుంటారు. ఆ ఊరి ప్రెసిడెంట్ జింక వేణు (కిరణ్), అంజి మామ (అంజి మామ మిల్కూరి) వీళ్ళ ముగ్గురికి మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తూ వుంటారు. మయి మామ కూతురు మౌనిక (సార్య లక్ష్మణ్)తో ప్రేమలో ఉంటాడు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ, మామ ఇతనికి పనీ పాటా ఏమి లేదు అందుకని పిల్లని అని ఇవ్వని అంటాడు. ఈ ముగ్గురూ ఫేమస్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు ఏంటి? ఇంతకీ ముగ్గురూ ఫేమస్ అయ్యారా? అయితే ఎలా అయ్యారు అనేది సినిమా.
విశ్లేషణ:
ఈ ఓటిటి చానెల్స్ వచ్చాక సినిమాలు తీయటం ఎక్కువ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే సినిమా తీసాక, థియేటర్ కి కాకపోతే ఓటిటి వుంది కదా అనే భరోసా తీసిన వాళ్ళకి వుంది కనక. అలాగే ప్రేక్షకులు కూడా సినిమా చూసాక ఇది ఓటిటి సినిమా అని, థియేటర్ సినిమా అని డిసైడ్ చేసేస్తున్నారు. ఎందుకు ఈ ప్రస్తావన అంటే, ఇప్పుడు విడుదల అయిన 'మేము ఫేమస్' #MemuFamousFilmReview ఏ కేటగిరీ లోకి వస్తుంది అనేది విశ్లేషిచుకుందాం. సుమంత్ ప్రభాస్ దర్శకుడు, నటుడు ఈ 'మేమ్ ఫేమస్' సినిమాకి అతనే ప్రధానం. #MemuFamousReview అతను యూట్యూబ్ లో ఏవో షార్ట్ ఫిలిమ్స్, వీడియోస్ చేసి పాపులర్ అయ్యాడు, కానీ యూట్యూబ్ లో చేసే కంటెంట్ కి, థియేటర్లో పెద్ద తెర మీద చేసే కంటెంట్ కి చాలా తేడా ఉంటుంది అని గ్రహించాలి. అయితే ఇతను యువకుడు కాబట్టి తెలుసుకుంటాడు ముందు ముందు.
ఇంకో విషయం ఏంటంటే, ప్రతి యువకుడు మొదటి సినిమాతోటే విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి లా అయిపోవాలని అనుకుంటాడు. విజయ్ దేవరకొండ కి ఆ స్టార్ డమ్ వచ్చింది అంటే అతను ఎంత కష్టపడ్డాడో అతన్ని గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా. ముఖ్యంగా విజయ్ ని ఇమిటేట్ చేసి అతనిలానే అయిపోదాం అనుకుంటే అది కరెక్టు కాదు. ఈ 'మేము ఫేమస్' సినిమా చూస్తున్నప్పుడు అందులో సుమంత్ ప్రభాస్ కొంచెం ఈ ఇద్దరి నటులను ఇమిటేట్ చేసాడేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏవో కొన్ని సన్నివేశాలు కామెడీ గానే, భావోద్వేగంగానో పెడితే సరిపోదు. దానికి తగ్గ కథ ఉండాలి. అంతే కానీ, కథ లేకుండా ఎదో కామెడీ సన్నివేశాలు పెట్టి సినిమా తీసేస్తాం అంటే నడవదు.
ఇప్పుడు 'మేమ్ ఫేమస్'లో అదే అయింది. ముగ్గురు యువకులు వూర్లో బలాదూర్ గా తిరుగుతూ వుంటారు, వాళ్ళకి పని పాటా లేదు, వాళ్ళు వాళ్ళ తప్పును గ్రహించి ఎలా పేరు, డబ్బు సంపాదిస్తారు అన్నది కాన్సెప్ట్. అయితే దర్శకుడు సుమంత్ ఇది సినిమా అని మరిచిపోయి యూట్యూబ్ అనుకోని తీసినట్టున్నాడు. అందుకని అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి కానీ, మొత్తం సినిమాగా చూస్తే మాత్రం చాలా కష్టం. అయితే సుమంత్ యువకుడు, కాబట్టి ముందు ముందు నేర్చుకుంటాడు.
తెలంగాణా నేపథ్యంలో తీసిన సినిమా, అలాగే ఇంతకు ముందు వచ్చిన సినెమాలవలె ఇందులో కొన్ని మాటలు, సీన్స్ ఎదో ఆలా పెట్టి తీసేస్తే నడవదు కదా. కథలో కామెడీ ఎక్కడ ఉండాలి, భావోద్వేగాలు ఎక్కడ ఉండాలి అనేవి రెండూ బాలన్స్ చేసుకొని తీయాలి. సుమంత్ అక్కడే పొరపాటుపడ్డాడు. 'జబర్దస్త్' #Jabardasth షో లా మొబైల్ ఫోన్స్ లో, టీవీ లో ఈ సినిమాలో బాగున్నా కొన్ని సన్నివేశాలు కట్ చేసి వేస్తె చూసుకొని నవ్వుకోవచ్చు. సినిమాగా చూడటానికి మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. రెండో సగం అయితే పూర్తిగా అలానే తీశారు. అయితే ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి. నిర్మాతలు కొత్త టాలెంట్ ని పరిచయం చేశారు. ఈ సినిమాతో చాలామంది నటీనటులు పరిచయం అయ్యారు, అలాగే సాంకేతిక నిపుణులు కూడా. మెయిన్ లీడ్ యాక్టర్ సుమంత్ వేరే వాళ్ళని అనుకరించకుండా తన ప్రత్యేకతను చాటుకుంటే మంచిది, ఫ్యూచర్ ఉంటుంది. చాలామంది నటీనటులు వున్నారు, అందరూ బాగానే చేశారు.
చివరగా, 'మేమ్ ఫేమస్' (Mem Famous Review)సినిమా యూట్యూబ్ కోసమో, ఓటిటి కోసమో తీసిన సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమాని థియేటర్ లో చూడటానికి కొంచెం ఓపిక ఉండాలి. అలాగే ఈ సినిమా సింక్ సౌండ్ లో రికార్డు చేసాము అని చెప్పారు, కానీ నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్య థియేటర్ లో చూసాను, సౌండ్ అస్సలు బాగోలేదు. మాటలు సరిగ్గా వినిపించలేదు. ఫేమస్ కావటానికి ఒక్క ప్రచారాలు మాత్రమే సరిపోవు, మంచి సినిమా తీసి కూడా ఫేమస్ అవొచ్చు.