Bichagadu 2 film review: విజయ్ ఆంటోనీకి హిట్ వచ్చినట్టేనా... ?

ABN , First Publish Date - 2023-05-19T14:21:07+05:30 IST

విజయ్ ఆంటోనీ కి బాగా తెలుగు, తమిళం లో బాగా పాపులారిటీ సంపాదించి పెట్టిన సినిమా 'బిచ్చగాడు'. కానీ ఆ తరువాత అతనికి హిట్ రాలేదు, మళ్ళీ ఇప్పుడు అదే పేరుతో అంటే 'బిచ్చగాడు 2' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి దర్శకుడు కూడా విజయ్ ఆంటోనీ నే. మరి ఈ సినిమా అతను కోరుకున్నట్టు బ్రేక్ ఇచ్చిందా..

Bichagadu 2 film review: విజయ్ ఆంటోనీకి హిట్ వచ్చినట్టేనా... ?
Bichagadu 2

సినిమా: బిచ్చగాడు 2

నటీనటులు: విజయ్ ఆంటోని (VijayAntony), కావ్య తాపర్ (KavyaThapar), రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, దేవ్ గిల్ (DevGill), యోగిబాబు తదితరులు

మాటలు, పాటలు: భాషా శ్రీ

ఛాయాగ్రహణం: ఓమ్ నారాయణ్

నిర్మాత: ఫాతిమా విజయ్

రచన, దర్శకత్వం: విజయ్ ఆంటోనీ

-- సురేష్ కవిరాయని

విజయ్ ఆంటోనీ తమిళ నటుడు, కానీ అతని 'బిచ్చగాడు' (Bichagadu) అనే సినిమా తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తే చాలా పెద్ద విజయం సాధించటమే కాకుండా, విజయ్ కి ఒక మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ ఆ సినిమాతో. అయితే ఆ తరువాత అతని సినిమాలు అన్నీ తెలుగులోకి అనువాదం అయ్యాయి కానీ, 'బిచ్చగాడు' అంత విజయం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు విజయ్ ఆంటోనీ నిర్మాతగానే కాకుండా, దర్శకత్వం కూడా చెయ్యాలని డిసైడ్ అయి 'బిచ్చగాడు 2' #Bichagadu2FilmReview సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా తమిళ సినిమా, కానీ తెలుగులో అనువాదం అయింది. మరి ఈ సినిమా అతనికి ఎంతో కాలం నుంచి రాణి బ్రేక్ ని ఇస్తుందో లేదో చూద్దాం...

Bichagadu2-Image-2.jpg

Bichagadu 2 story కథ :

భారతదేశంలో అత్యంత సంపన్న ధనవంతుల్లో విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ)ది ఏడో స్థానం. #Bichagadu2FilmReview అయితే అతను డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్పడానికి, ఎన్నికల ఫండ్ పేరుతో ముఖ్యమంత్రికి రూ 5,000 కోట్లు ఇస్తాడు. అలాగే అతని తండ్రి చనిపోతే, వెంటనే ఆ వార్తను ప్రకటిస్తే వందల కోట్లు నష్టం వస్తుందని తెలిసి తండ్రి మరణవార్తను ఒక రెండు నెలలు డిలే చెయ్యమంటాడు. అతనికి ఇద్దరు స్నేహితులు వుంటారు, అందులో ఒకరు అరవింద్ (దేవ్ గిల్). వాళ్ళు ఇతని కంపెనీలో పని చేస్తూ, ఇతనికి సలహాలు ఇస్తూ వుంటారు, అలాగే ఇతని కంపెనీని కూడా తమ హస్తగతం చేసుకోవాలని కుట్రలు కూడా పన్నుతూ వుంటారు. విజయ్ కి సెక్రటరీ, అలాగే అతని ప్రియురాలు కూడా అయిన హేమ (కావ్య తాపర్) ఉంటుంది. #Bichagadu2Review ఈలోగా టీవీలో ఒక డాక్టర్ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి చెపితే అది అరవింద్ విని, విజయ్ గురుమూర్తిని చంపేసి, అతని బ్రెయిన్ లోకి వేరేవాళ్ళ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ (Brain Transplant) చేసి, కంపెనీ హస్తగతం చేసుకోవాలని అనుకుంటాడు. #Bichagadu2FilmReview అయితే విజయ్ లా వుండే సత్య (విజయ్ ఆంటోనీ) అనే బిచ్చగాడు వీళ్ళకి దొరుకుతాడు, అతనికి విజయ్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు సత్య, విజయ్ లా మారతాడు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి అవుతుంది. ఏమి జరిగింది, తరువాత ఏమైంది అన్నది సినిమా చూడాల్సిందే.

Bichagadu2-Image-1.jpg

విశ్లేషణ:

విజయ్ ఆంటోనీ కి ఈరోజు వరకు బాగా పేరు తెచ్చిన సినిమా 'బిచ్చగాడు'. #Bichagadu అది టీవిలో ఈరోజుకి కూడా చాలామంది చూస్తారు, అంత పెద్ద హిట్ అయింది. కానీ ఆ తరువాత విజయ్ కి అంతటి హిట్ రాలేదు. 'బిచ్చగాడు' సినిమాలో తల్లి, కొడుకుల అనుబంధం ఆ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇప్పుడు 'బిచ్చగాడు 2' #Bichagadu2FilmReview తో విజయ్ ఆంటోనీ తనే దర్శకుడిగా కూడా అవతారం ఎత్తి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో చెల్లి సెంటిమెంట్ పెట్టుకున్నాడు. మొదటి చిత్రానికి, ఈ రెండో చిత్రానికి చాలా వైవిధ్యం వుంది. అందులో ధనవంతుడు బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు, ఇందులో బిచ్చగాడు ధనవంతుడి అవతారం ఎత్తడమే కాకుండా, కొంచెం ఆసక్తికర అంశాలు పెట్టాడు. సెంటిమెంట్ తో పాటు చాలా థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి ఇందులో.

Bichagadu-Image-3.jpg

సినిమా మొదలవ్వటమే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ అని, ఒక మనిషి చనిపోయాక, అతని బ్రెయిన్ ని వేరేవాళ్లకి పెట్టి, చనిపోయిన మనిషి ఆలోచనలని బతికించుకోవచ్చు అని ఒక డాక్టర్ చెప్పిన థీరీ ఆసక్తిగా చూపించాడు. మొదటి సగం అంతా కూడా ఈ పాయింట్ మీద కథ నడిపాడు. #Bichagadu2FilmReview అలా అని ఆ థీరీ మీద చర్చలు, ఎలా, ఏంటి అంటూ ఆపరేషన్ థియేటర్, డాక్టర్ల హడావిడి ఏమి లేకుండా ప్రేక్షకుడికి విసుగు లేకుండా నీటుగా చూపించేసాడు. మొదటి సగం అయిన తరువాత రెండో సగం ఎలా వుండబోతోంది అనే విషయం ప్రేక్షకుడికి ఆసక్తికరంగా ఉంటుంది, తొందరగా చూడాలన్న తపన కూడా పుట్టించాడు.

Bichagadu-Image5.jpg

రెండో సగంలో మాత్రం దర్శకుడు విజయ్ ఆంటోనీ కన్నా, నటుడు విజయ్ ఆంటోనీ బాగా డామినెటే చేసినట్టున్నాడు. అందుకని కొంచెం సామజిక సేవ, ప్రీచింగ్ ఎక్కువయ్యాయి. బిచ్చగాడు, ధనవంతుడు అయితే పేదవాళ్ల కష్టం ఎంతలా తెలుస్తుంది అనే విషయం మీద కొంచెం స్పీచ్ లు ఎక్కువ ఇచ్చేసాడు అనిపిస్తుంది. అలాగే కథ కూడా కొంచెం గాడి తప్పింది అనిపిస్తుంది. #Bichagadu2FilmReview మధ్యలో ఈ స్పీచ్ లు కొంచెం విసుగు అనిపించినా, మళ్ళీ చివరలో భావోద్వేగాలు బాగా పండించాడు. మొత్తం మీద మళ్ళీ బిచ్చగాడే విజయ్ ఆంటోనీ కి బ్రేక్ ఇచ్చేట్టు కనపడుతోంది.

నటీనటులు ఎలా చేసారంటే:

విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో చాలా పాత్రలు పోషించాడు. ఒక పక్క నటుడిగా, మరో పక్క దర్శకుడిగా, అలాగే రచన, సంగీతం కూడా అతనే చేసాడు. ఇవన్నీ కూడా ఈ సినిమాకి బాగా సెట్ అయ్యాయి అనే కన్నా, తాను బాగా కుదుర్చుకున్నాడు అంటే బాగుంటుంది. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా బాగానే చేసాడు. ఇందులో కథానాయకురాలు కావ్య తాపర్ చాలా గ్లామర్ గా అందంగా వుంది. ఆమె పాత్ర చిన్నదే అయినా, బాగానే చేసింది. తెలుగులో కూడా విలన్ గా కనిపిస్తూ వుండే దేవ్ గిల్ కి చాలా కాలం తరువాత ఒక మంచి పాత్ర దొరికింది విలన్ గా. చాలామంది తమిళ నటులు వున్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు.

Bichagadu-Image-4.jpg

ఇప్పటి తరం ప్రేక్షకులకి, అలాగే మాస్ నచ్చే వాళ్ళకి అనుగుణంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు. అలాగే కోర్ట్ డ్రామా కొంచెం ఆసక్తికరంగా చేసి ఉంటే బాగుండేది. నేపధ్య సంగీతం బాగుంది, విజయ్ ఆంటోనీ ని ప్రతి సన్నివేశంలో బాగా ఎలివేట్ చేస్తుంది. ఛాయాగ్రహణం కూడా బాగుంది.

చివరగా, 'బిచ్చగాడు 2' లో చాలా కమర్షియల్ గా తీసిన సినిమా. ఇందులో అన్నీ ఉంటాయి. విజయ్ ఆంటోనీ మళ్ళీ 'బిచ్చగాడు' గా అవతారం ఎత్తి, తనే అన్నీ సమకూర్చుకొని ప్రేక్షకులకి ఏమి కావాలో అవన్నీ ఇందులో పెట్టాడు. 'బిచ్చగాడు' కి దీనికి ఎటువంటి పోలిక ఉండదు. ఇది దానికి సీక్వెల్ కాదు, ఇది వేరే కథ. చాలా కాలం తరువాత విజయ్ ఆంటోనీ కి ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది అనటంలో సందేహం లేదు.

Updated Date - 2023-05-19T14:21:07+05:30 IST