Custody film review: థియేటర్ లో ప్రేక్షకుల కస్టడీ
ABN , First Publish Date - 2023-05-12T13:59:51+05:30 IST
అక్కినేని కుటుంబం, అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా నాగ నాచైతన్య నటించిన ద్విభాషా చిత్రం 'కస్టడీ'. ఎందుకంటే పాపం నాగార్జున, అఖిల్, సుశాంత్ అందరూ ఫ్లాప్ లు ఇచ్చారు, ఇప్పడు నాగ చైతన్య మీద గంపెడాశ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే...
సినిమా: కస్టడీ
నటీనటులు: నాగ చైతన్య (NagaChaitayna), కృతి శెట్టి, ప్రియమణి (Priyamani), అరవింద్ స్వామి, శరత్ కుమార్ (SarathKumar), జీవ (Jiiva), రాంకీ, సంపత్ రాజ్ తదితరులు
సంగీతం: ఇళయరాజా (Ilayaraja), యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: ఎస్ ఆర్ కథిర్
దర్శకత్వం: ఎస్ ఆర్ ప్రభు
నిర్మాత: చిట్టూరి శ్రీనివాస్
-- సురేష్ కవిరాయని
ఈమధ్య చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన చాలామంది, నిర్మాతలు, దర్శకులు, నటులు తెలుగు టాలెంట్ ని నమ్ముకోవటం మానేసి, తమిళ దర్శకులను, తమిళ నటులను బాగా నమ్ముతున్నారు. అందులో కొంతమంది లాభం పొందుతున్నారు, ఎక్కువమందికి నష్టం వాటిల్లుతోంది. ఇదిలా పక్కన పెడితే, చాలామంది తెలుగు నటులు ఈమధ్య ద్విభాషా చిత్రాలను వొప్పుకొని, దానికి తమిళ దర్శకుడిని పెట్టుకొని చిత్రాలు తీశారు. అవన్నీ ప్లాప్ అయ్యాయి ఒక్క సినిమా కూడా సరిగ్గా నడవలేదు. అందులోనే మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమా కూడా వుంది. మురుగుదాస్ దానికి దర్శకుడు, అయినా అది డిజాస్టర్ అయింది. అలా చాలామంది నటులు చేశారు, ఈమధ్యనే సందీప్ కిషన్ కూడా 'మైకేల్' అనే సినిమా ద్విభాషా చిత్రంగా వచ్చింది, డిజాస్టర్ అయింది. #CustodyFilmReview దానికన్నా ముందు రామ్ పోతినేని, 'వారియర్' అని #CustodyFilmReview ద్విభాషా సినిమా చేసాడు, లింగుస్వామి అనే తమిళ దర్శకుడితో, కానీ అదికూడా డిజాస్టర్. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ఇంకా చాలా వున్నాయి. ఇన్ని తెలిసినా కూడా నాగ చైతన్య (NagaChaitanya) వెంకట్ ప్రభు (VenkatPrabhu) అనే తమిళ దర్శకుడితో 'కస్టడీ' అనే ద్విభాషా చిత్రంలో నటించాడు. ఇందులో కృతి శెట్టి కథానాయిక, చాలామంది తమిళ్ నటులు వున్నారు. అక్కినేని అభిమానుల ఆశలు అన్నీ కూడా ఈ 'కస్టడీ' సినిమా మీదే వున్నాయి, ఎందుకంటే నాగార్జున (Akkineni Nagarjuna), అఖిల్ (AkhilAkkineni) ఇద్దరూ ప్లాప్ ఇచ్చారు, కనీసం నాగ చైతన్య అయినా హిట్ ఇస్తాడేమో అని. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో, చైతన్యకి బ్రేక్ వచ్చిందో లేదో చూద్దాం.
Custody story కథ:
ఈ కథ 1996 లో జరిగింది. శివ (నాగ చైతన్య) సఖినేటిపల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్, ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) పర్యటనలో బందోబస్తుకు వెళతాడు. అక్కడ ఒక అంబులెన్స్ కి దారి ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ఆపేస్తాడు, అతనికి డ్యూటీ అంటే ప్రాణం అందుకే ఆలా చేస్తాడు. ముఖ్యమంత్రి కూడా అతని ప్రవర్తనకి మెచ్చుకుంటుంది, ప్రశంసిస్తుంది, శివ ఫోటో, పేరు పేపర్లో వేస్తారు. శివకి రేవతి (కృతి శెట్టి) అనే ప్రియురాలు ఉంటుంది, ఆమె కారు డ్రైవింగ్ నేర్పుతూ ఉంటుంది. కానీ రేవతి తల్లిదండ్రులు శివ తో వివాహానికి ఒప్పుకోరు, ఇంకో అబ్బాయి (వెన్నెల కిశోర్)తో పెళ్లి నిశ్చయం చేస్తారు. #CustodyFilmReview రేవతికి ఆ పెళ్లి ఇష్టం లేదు, అందుకని శివని తనని తీసుకుపోయి పెళ్లిచేసుకో, #CustodyFilmReview లేదంటే చస్తా అంటుంది. ఇదిలా ఉంటే, శివ డ్రంకెన్ డ్రైవ్ కేసులో రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) ను అరెస్టు చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లాకప్ లో పడేస్తాడు. మొదట్లో శివ నమ్మకపోయినా, జార్జ్ ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసి అతను సిబిఐ ఆఫీసర్ అని నమ్ముతాడు. ఈలోగా రాజును, జార్జ్ ని స్వయంగా పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) #CustodyFilmReview పోలీస్ ఫోర్స్ తో రౌడీలతో వచ్చి చంపాడనికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ రాజు ఎవరు, ఎందుకు అతన్ని పోలీసులు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్లందరి వెనకాల #CustodyFilmReview వున్నది ఎవరు? సిబిఐ ఆఫీసర్ ఎందుకు రాజుని సేవ్ చేసి తనతో తీసుకు వెళ్ళాలి అనుకుంటాడు. రాజు ఎన్నో మర్డర్ లు చేసినా, బాంబులదాడితో చాలామంది ప్రాణాలు తీసినా, శివ ఎందుకు అతన్ని కాపాడాలి అనుకుంటాడు? ఇవన్నీ తెలియాలంటే 'కస్టడీ' చూడాల్సిందే.
విశ్లేషణ:
పరిశ్రమలో ఈమధ్య కొన్ని వ్యంగ మాటలు బాగా తిరుగుతున్నాయి. తెలుగు నటులకి తెలుగు వాళ్ళు చెప్పిన కథలు నచ్చటం లేదు, అందుకని తమిళం లో చెపితే బాగా ఎక్కుతున్నాయి, అందుకే తమిళం వాళ్ళని బాగా పట్టుకున్నారు అని. లేదా మలయాళం, తమిళ సినిమా రీమేక్ లు (ఓటిటి లో వచ్చినా కూడా) తీసేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే 'కస్టడీ' కూడా అటువంటి బాపతే. నాగ చైతన్య చేసిన పెద్ద తప్పు 'కస్టడీ' అనే సినిమా ద్విభాషా చిత్రంగా చెయ్యటం, దానికి ఒక తమిళ దర్శకుడిని ఎంచుకోవటం. ఇది దర్శకుడు వెంకట్ ప్రభు కి మొదటి తెలుగు సినిమా అవ్వటం. ఇలా తీసేటప్పుడు చాలా #CustodyReview జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ చిత్ర నిర్వాహకులు ఇది పోలీస్ డ్రామా కాబట్టి, అది రెండు భాషల ప్రేక్షకులకు నచుతుంది అని అనుకుని వుంటారు. అలాంటప్పుడు ఆ కథ కొంచెం రియలిస్టిక్ గా ఉండాలి, కథ చాలా బలంగా ఉండాలి. అయితే ఈ 'కస్టడీ' లో ఆ రెండూ లోపించాయి. దర్శకుడు బ్రూస్ విల్లిస్ (Bruce Willis) నటించిన '16 బ్లాక్స్' (16Blocks) అనే ఇంగ్లీష్ సినిమాని స్ఫూర్తిగా పొంది ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తోంది. CustodyFilmReview ఎందుకంటే అందులో కూడా బ్రూస్ విల్లిస్ ఒక సాక్షిని రక్షిస్తాడు. ఆ సాక్షిని కోర్టులో ప్రవేశ పెట్టాలి, కానీ రక్షించాల్సిన పోలీసుల్లో అతన్ని చంపడానికి చూస్తారు, ఆ సాక్షిని రక్షిస్తున్న బ్రూస్ విల్లిస్ ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ 'కస్టడీ' సినిమా కూడా ఇంచుమించు అలానే ఉంటుంది, అందుకే ఆ సినిమా ఆధారంగా తీశారు అనిపించింది.
ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ప్రారంభం బాగుంది బాంబ్ పేలుడు, తరువాత దృశ్యాలు. కానీ ఆ తరువాతే సినిమా గతి తప్పుతుంది, మతి తప్పుతుంది. లాజిక్ మిస్సవుతుంది. నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది, ప్రేక్షకులు ఆశించినంతగా లేకుండా, కథ చాలా నత్తనడకగా సాగుతూ, రాబోయే సన్నివేశాలు కూడా ఇట్టే చెప్పేయొచ్చు అన్నంతగా ఉంటుంది. పోనీ ఈ చిత్రానికి సంగీతం గ్రేట్ ఇళయరాజా, అతని కుమారుడు ఇచ్చారు, పోనీ అదైనా బాగుంటుంది అంటే, నేపధ్య సంగీతం, పాటలు రెండూ బాగోలేవు. ప్రేక్షకులను చాలా నిరాశపరిచారు. మధ్యమధ్యలో ఒకటి రెండు పోరాట సన్నివేశాలు తప్పితే సినిమాలో దమ్ము లేదు, విషయం లేదు, కథ లేదు.
ఒక సమయంలో అయితే ప్రేక్షకుడికి తమిళ సినిమా చూస్తున్నాము అన్న సందేహం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అంతా తమిళ వాసన. శరత్ కుమార్ (SarathKumar), అరవింద్ స్వామి (AravindSwami), మధ్యలో జీవ (Jiiva), రాంకీ (Ramkee), జయప్రకాశ్, ఇంకా చాలామంది తమిళ నటులు వస్తూ వుంటారు. అందువలన ఇది తమిళ సినిమా అన్న సందేహం వచ్చేస్తుంది. నాగ చైతన్య చేసిన పెద్ద త్తమ్పిదాల్లో ఈ 'కస్టడీ' ఒకటి, అంటే సినిమా చెయ్యడం ఒకటయితే, మళ్ళీ దీన్ని ద్విభాషా చిత్రంగా ఎంచుకోవటం. ఒక్కొక్క తమిళ నటుడికి ఇచ్చిన ఎలివేషన్ చూస్తూ ఉంటే, ఒక తమిళ సినిమాలో తెలుగు నటుడు నాగ చైతయం ఒక ముఖ్య పాత్ర పోషించినట్టుగా ఉంటుంది. అంతా దారుణంగా తీశారు, అంత చీప్ గా కూడా చుట్టేశారు అనే చెప్పాలి. మాటలు కూడా అంత బాగోలేదు, పాటలు అసలు గుర్తే లేవు. ఛాయాగ్రహణం కూడా ఓ మాదిరి వుంది అంతే. ఈ సినిమాకి చాలామంది దర్శకుడు వెంకట్ ప్రభు కుటుంబ సభ్యులే పని చేశారు అని అంటున్నారు. ఛాయాగ్రహణం, ఆర్ట్, ఇంకా సాంకేతిక డిపార్ట్మెంట్ లో.
నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య చెప్పుకోదగ్గ పాత్రలో ఏమి చెయ్యలేదు. మామూలు కానిస్టేబుల్ పాత్ర, అంతే. కృతి శెట్టి కూడా అంతే, ఆమెకు ఇది మరో సినిమా. చాలామంది తమిళ నటులు వున్నారని చెప్పా కదా, వాళ్ళందరి ఎలివేషన్ బాగుంది. ప్రియమణి పరవాలేదు. వెన్నెల కిశోర్ వేస్ట్.
చివరగా, 'కస్టడీ' సినిమా ఒక తమిళ్ సినిమా తెలుగులోకి డబ్బింగ్ చేసినట్టుగా ఉంటుంది. తమిళ సినిమాలో నాగచైతన్య ఒక పాత్ర వేసాడు అని అనిపిస్తుంది. తెలుగు టాలెంట్ ని నమ్ముకోకుండా, అంతా తమిళం మీదే ఆధారపడితే ఇదిగో ఈ 'కస్టడీ' లాగే ఉంటుంది ఫలితం. ప్రేక్షకులను థియేటర్లో 'కస్టడీ' చేసి ఈ సినిమా చూపించాలి, లేదంటే వాళ్ళు వెళ్లిపోయే ప్రమాదం వుంది. పాపం అక్కినేని కుటుంబం, అభిమానులకు ఇది మరో చేదు వార్తే. ఎందుకంటే 'కస్టడీ' కూడా కోరుకున్న ఫలితాన్ని ఇవ్వకపోగా, ఎందుకురా బాబు ఈ అక్కినేని కుటుంబంలో నటులు ఇలాంటి పనికిరాని కథలు ఎంచుకుంటున్నారు అని అభిమానులే అంటున్న స్థితికి వచ్చేసారు. ఎందుకంటే థియేటర్ నుండి బయటకి వచ్చిన అక్కినేని అభిమానులే అన్న మాటలు అవి.