Ye Chota Nuvvunna: వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక.. విడుదల తేదీ ఫిక్స్

ABN , First Publish Date - 2023-11-13T20:20:04+05:30 IST

ఎమ్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో మందలపు శ్రీనివాసరావు - మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా ఎస్ వి. పసలపూడి దర్శకత్వంలో నిర్మించిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘ఏ చోట నువ్వున్నా’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Ye Chota Nuvvunna: వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక.. విడుదల తేదీ ఫిక్స్
Ye Chota Nuvvunna Movie Stills

ఎమ్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో మందలపు శ్రీనివాసరావు (Mandalapu Srinivasa Rao) - మేడికొండ శ్రీనివాసరావు (Medikonda Srinivasa Rao) సంయుక్తంగా ఎస్ వి. పసలపూడి (SV Pasalapudi) దర్శకత్వంలో నిర్మించిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘ఏ చోట నువ్వున్నా’ (Ye Chota Nuvvunna). ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యంలో అందంగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ మంచి కథాంశాన్ని ఎన్నుకొన్న దర్శకుడు ఎస్.వి. పసలపూడి, నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావులను అభినందించారు.

ఇంకా ఈ వేడుకకు హాజరైన ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, ఎ. ఎస్ రవికుమార్ చౌదరి, నర్రా శివనాగు.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ నిర్మాత అహితేజ బెల్లంకొండ, నటులు- నిర్మాత రాంకీ, రచయిత మరుదూరి రాజా, ఈవెంట్ స్పాన్సర్ చేసిన వ్యాపారవేత్త ఎల్.ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ శివ రెమిడాల చిత్ర విజయాన్ని కోరుతూ.. యూనిట్‌కి అభినందనలు తెలిపారు. చిత్ర దర్శక నిర్మాతలకు అత్యంత సన్నిహితులు, ‘రారా పెనిమిటి’ దర్శకనిర్మాత సత్య వెంకట్ గెద్దాడ చిత్ర యూనిట్‌ని సభకు పరిచయం చేశారు. (Ye Chota Nuvvunna Pre Release Event)


YCN.jpg

అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేస్తున్నాం. దర్శకుడు ఎస్.వి పసలపూడి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని కొనియాడారు. దర్శకుడు ఎస్. వి మాట్లాడుతూ.. నిర్మాతల సహాయసహకారాలు మరువలేనివి. మా చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ సమాకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. రచయిత కుమార్ పిచ్చుక రాసిన మాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలను కచ్చితంగా పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

*****************************

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

Updated Date - 2023-11-13T20:20:10+05:30 IST