ఆ రెండు చిత్రాల స్ఫూర్తితో..
ABN , First Publish Date - 2023-08-20T02:10:22+05:30 IST
సినిమా అంతా ఫిక్షనల్ ఐలెండ్‌లో జరుగుతుంది. మేం ఎదురులంక అనే ఊళ్లో షూటింగ్ చేశాం. కథ లో ఓ ఫియర్ ఉంటుంది. దానిని కంటిన్యూ చేసేలా ‘బెదురులంక 2012 నే టైటిల్ పెట్టాం...

సినిమా అంతా ఫిక్షనల్ ఐలెండ్‌లో జరుగుతుంది. మేం ఎదురులంక అనే ఊళ్లో షూటింగ్ చేశాం. కథ లో ఓ ఫియర్ ఉంటుంది. దానిని కంటిన్యూ చేసేలా ‘బెదురులంక 2012 నే టైటిల్ పెట్టాం. మేందు వేరే టైటిల్స్ అనుకున్నా చివరకు ఇదే బాగుందని కార్తికేయ, బెన్ని అన్నారు’ అని చెప్పారు క్లాక్స్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన ‘బెదురులంక 2012 ’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. క్లాక్స్ అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాకు అకిరా కురసోవా రూపొందించిన ‘సెవెన్ సమురాయ్’ చిత్రం చాలా ఇష్టం. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ‘రేపు ఉండదని అన్నప్పుడు సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం. అది నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్ మీద ఏదో ఒకటి తీయాలనిపించింది. అప్పుడే హాలీవుడ్ చిత్రం ‘2012’ వచ్చింది. ఈ రెండింటి స్పూర్తితో పల్లెటూరి నేపథ్యంలో కొత్త కథ రాశా. డ్రామెడీ జానర్ సినిమా తీశా. ఊరిని ఏదిరించే యువకుడి పాత్రను కార్తికేయ పోషించారు’ అన్నారు క్లాక్స్.