Mani Ratnam movie names : మణిరత్నం సినిమా పేర్లతో..
ABN , First Publish Date - 2023-05-10T00:45:51+05:30 IST
రోజా, దిల్‌సే, అంజలి, గీతాంజలి, ఘర్షణ.. ఇవన్నీ మణిరత్నం సినిమా పేర్లే. ఈ టైటిళ్లన్నీ పూస గుచ్చి ఓ పాట రాస్తే ఎలా ఉంటుంది? అదే చేశారు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖుషి’....

రోజా, దిల్‌సే, అంజలి, గీతాంజలి, ఘర్షణ.. ఇవన్నీ మణిరత్నం సినిమా పేర్లే. ఈ టైటిళ్లన్నీ పూస గుచ్చి ఓ పాట రాస్తే ఎలా ఉంటుంది? అదే చేశారు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖుషి’. మంగళవారం విజయ్‌దేవరకొండ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘నా రోజా నువ్వే.. నా దిల్‌సే నువ్వే’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటని శివ నిర్వాణ స్వయంగా రాశారు. హేషమ్ అబుదల్ వాహబ్ స్వర పరచి, పాడారు. ఈ పాటలో మణిరత్నం సినిమా టైటిళ్లు వచ్చేలా సాహిత్యం సాగింది. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ గీతాన్ని తెరకెక్కించినట్టు చిత్రబృందం తెలిపింది. సమంత ఓ కశ్మీరీ యువతిగా నటించింది. ఆమె మనసు దోచుకోవడానికి ప్రయత్నించే అబ్బాయిగా విజయ్ కనిపిస్తారు. సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.