లియో 2 ఎప్పుడంటే...
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:46 AM
దక్షిణాదిన వరుసగా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్స్‌తో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఆయన రూపొందించిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి...

దక్షిణాదిన వరుసగా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్స్‌తో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఆయన రూపొందించిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. వాటికి సీక్వెల్స్ కూడా ప్రకటించారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లియో’ చిత్రానికి కూడా సీక్వెల్ రాబోతోందనే ఊహాగానాలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా లోకేశ్ కూడా అది నిజమేనని చెప్పారు. ‘లియో’కు స్వీకెల్ చేస్తున్నా, అయితే దానికి కాస్త సమయం పడుతుందన్నారు. ముందు రజనీకాంత్ ‘తలైవా 171’, ‘ఖైదీ 2’ చిత్రాలు పూర్తవ్వాలన్నారు. ఆ తర్వాత ‘లియో 2’ కోసం రంగంలోకి దిగుతానన్నారు. విజయ్, త్రిష జంటగా నటించిన ‘లియో’ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీసు హిట్‌గా నిలిచింది.