Tiger Nageswara Rao : వీడు ఎలాంటోడంటే..?!

ABN , First Publish Date - 2023-09-23T01:59:08+05:30 IST

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌, రేణూ దేశాయ్‌ కీలక పాత్రలు పోషించారు...

Tiger Nageswara Rao : వీడు ఎలాంటోడంటే..?!

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌, రేణూ దేశాయ్‌ కీలక పాత్రలు పోషించారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ నామా నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘వీడు..’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. కథానాయకుడి లక్షణాల్ని, గుణగణాల్ని తెలిపే పాట ఇది. చంద్రబోస్‌ రాశారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. జి.వి.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. ‘‘ఎదురొచ్చినవాడ్ని తొక్కుకొంటూ ఎదగడం టైగర్‌ నాగేశ్వరరావుకి అలవాటు. దోచుకోవడమే జీవిత ఆశయం అనుకొనే దొంగ. అతనిలోని లక్షణాలన్నీ ఈ పాటలో కనిపిస్తాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఏక్‌ దమ్‌’ పాటకూ చాలా మంచి స్పందన వచ్చింది. అక్టోబరు 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత.

Updated Date - 2023-09-23T01:59:08+05:30 IST