పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాం!
ABN , First Publish Date - 2023-06-14T04:00:34+05:30 IST
‘‘వచ్చే మూడేళ్లలో హాలీవుడ్ చిత్రాలతో పాటుగా పాన్ వరల్డ్ సినిమాల్ని నిర్మించడమే మా లక్ష్యం. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ’’న్నారు నిర్మాత టీజీ.విశ్వ ప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలు అందించారాయన...

‘‘వచ్చే మూడేళ్లలో హాలీవుడ్ చిత్రాలతో పాటుగా పాన్ వరల్డ్ సినిమాల్ని నిర్మించడమే మా లక్ష్యం. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ’’న్నారు నిర్మాత టీజీ.విశ్వ ప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలు అందించారాయన. ‘బ్రో’ ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రం. అతి తక్కువ కాలంలో వంద చిత్రాలు నిర్మించి, సరికొత్త రికార్డు సృష్టించడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తెలుగు హక్కుల్ని ఈ సంస్థే దక్కించుకొంది. ఈనెల 16న ‘ఆదిపురుష్’ విడుదల అవుతున్న సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘‘ఆదిపురు్‌షపై మంచి బజ్ ఉంది. ఈ సినిమా గురించి అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. బిజినెస్ లెక్కలు వేసుకొనే ‘ఆదిపురుష్’ హక్కుల్ని చేజిక్కించుకొన్నాం. టీ సిరీస్ భవిష్యత్తులో నిర్మించే చిత్రాల్ని తెలుగులో విడుదల చేయాలన్న ఆలోచన ఉంది. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్నీ తెలుగులో మా సంస్థ నుంచే విడుదల చేస్తాం’’
‘‘వేగంగా చిత్రాల్ని నిర్మిస్తూ వంద చిత్రాల మైలు రాయిని అందుకోవడం మా లక్ష్యం. సెట్స్‌పై దాదాపుగా 15 చిత్రాలున్నాయి. ‘బ్రో’ మా 25వ సినిమా. వచ్చే మూడు నాలుగేళ్లలో వంద సినిమాల మైలు రాయిని అందుకొంటాం. ఫ్యాక్టరీ తరహాలోనే చిత్ర నిర్మాణాన్ని చేపట్టాం. జయాపజయాలు మామూలే. అవన్నీ వ్యాపారంలో భాగం. తప్పులు ఎక్కడ చేస్తున్నామో తెలుసుకొంటూ ముందుకు వెళ్లాలి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పైనా దృష్టి సారించాం. ఓటీటీ రూపంలో మంచి రెవిన్యూ వస్తోంది. కేవలం థియేటర్ బిజినె్‌సపైనే ఆధారపడితే ఇన్ని సినిమాలు చేయలేం’’
‘‘ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో హనుమంతుడి సీటు ఆయన కోసమే ఉంచుతున్నాం. కొంతమంది సెలబ్రెటీలు వేల సంఖ్యలో టికెట్లు కొని, ఉచితంగా అందిస్తున్నారు. ఓ మంచి సినిమాని అందరికీ చూపించాలన్న మంచి ఆలోచనతో ఎవరికి వారు ముందుకొచ్చి తీసుకొన్న నిర్ణయం అది. ఇందులో ఎలాంటి పబ్లిసిటీ స్ర్టాటజీ లేదు’’