Nag Ashwin : కల్కి కోసం కొత్త ప్రపంచం సృష్టించాం

ABN , Publish Date - Dec 30 , 2023 | 05:17 AM

ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, వైజయంతీ మూవీస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘కల్కి 2898 ఏడి’. అగ్ర నిర్మాత అశ్వనీదత్‌

 Nag Ashwin : కల్కి కోసం కొత్త ప్రపంచం సృష్టించాం

నాగ్‌ అశ్విన్‌

ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, వైజయంతీ మూవీస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘కల్కి 2898 ఏడి’. అగ్ర నిర్మాత అశ్వనీదత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకోన్‌, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఐఐటీ బాంబేలో జరిగిన ‘టెక్‌ ఫెస్ట్‌’లో ఈ చిత్రం కంటెంట్‌ను ప్రదర్శించడమే కాకుండా చిత్ర విశేషాలను కూడా వెల్లడించారు.

టైమ్‌ ట్రావెల్‌ సినిమాలు వచ్చాయి కానీ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు మనవాళ్లు ఎవరూ తీయలేదనే చెప్పాలి. ‘కల్కి’ చాలా డిఫరెంట్‌ ఫిల్మ్‌. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్‌ ప్యూచరిస్ట్‌ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూశాం. ‘కల్కి’లో ఇండియన్‌ ప్యూచర్‌ సిటీలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు. ‘కల్కి’ కోసం దాదాపు ఐదేళ్లుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశాన్నీ లోతుగా ఆలోచించి, స్ర్కాచ్‌ నుంచి అన్నీ కొత్తగా డిజైన్‌ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.

కల్కి కోసం చాలా డిజైన్‌ వర్క్‌ చేశాం. కాన్సెప్ట్‌ ఆర్టిస్టులు, ప్రొడక్షన్‌ డిజైనర్స్‌ అంతా కలసి చాలా మేథోమధనం చేశారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, కాస్ట్యూమ్స్‌.. ప్రతిదీ భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్‌తో ఎలా మార్పు చెందే అవకాశం ఉందనే అంశం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్‌ చేశాం.

Updated Date - Dec 30 , 2023 | 09:25 AM