ఓ మంచి పని కోసం ముందుకొచ్చాం
ABN , First Publish Date - 2023-03-01T01:09:21+05:30 IST
అన్నిదానాల్లో విద్యాదానం గొప్పదంటారు. అందుకోసం ఆర్వేన్సిస్ కంపెనీతో చేతులు కలిపారు నటుడు అలీ. ఈ సంస్థ తెలుగు రాష్ర్టాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు చేయూతని...
అన్నిదానాల్లో విద్యాదానం గొప్పదంటారు. అందుకోసం ఆర్వేన్సిస్ కంపెనీతో చేతులు కలిపారు నటుడు అలీ. ఈ సంస్థ తెలుగు రాష్ర్టాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు చేయూతని అందించబోతోంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలీ మాట్లాడుతూ ‘‘ఇటీవల ఆస్ర్టేలియా వెళ్లాను. అక్కడున్న తెలుగువారంతా ‘అర్వేన్సిస్’ అనే ఓ సంస్థగా ఏర్పడి, ఒకేమాటపై ఉంటూ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ‘ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మన తెలుగు రాష్ర్టాల్లోనూ చేయొచ్చు కదా’ అని సలహా ఇచ్చాను. మరుసటి రోజు అరవైమంది నా దగ్గరకు వచ్చి.. ‘ఏం చేద్దామో చెప్పండి.. మేమంతా సిద్ధంగా ఉన్నాం’ అన్నారు. నామీద నమ్మకంతో... మన దేశంలో ప్రతిభ ఉండి, చదువు నోచుకోని విద్యార్థులకు అండగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఓ మంచి పని కోసం మేమంతా చేతులు కలిపాం. నా వల్ల పది కుటుంబాలైనా సంతోషంగా ఉంటే అదే చాలు’’ అన్నారు. ఆర్వేన్సిస్ సీఈతో శశిధర్ మాట్లాడుతూ ‘‘అలీ గారిని కలిశాక మా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఆస్ర్టేలియాలో చేసిన మంచి పనులు ఇక్కడా కొనసాగించాలనే నిర్ణయం తీసుకొన్నాం. విద్య, వైద్య, టెక్నాలజీ రంగాలలో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకోవాలని నిర్ణయించుకొన్నాం. మా సంస్థ కార్యాచరణని త్వరలోనే వివరంగా చెబుతామ’’న్నారు.