Telusa Manasa: పాట వదిలిన ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్

ABN , First Publish Date - 2023-02-14T19:21:38+05:30 IST

‘కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం (Kerintha fame Parvateesam), జ‌ష్విక (Jashvika) జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’ (Telusa Manasa). న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరీగా

Telusa Manasa: పాట వదిలిన ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్
Telusa Manasa Movie Still

‘కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం (Kerintha fame Parvateesam), జ‌ష్విక (Jashvika) జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’ (Telusa Manasa). న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ (Sri Balaji Pictures) బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మించారు. వైభ‌వ్ (Vaibhav) ద‌ర్శ‌కుడు. ప‌ల్లెటూరులో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు మ‌ల్లి బాబు పాత్ర‌లో పార్వ‌తీశం న‌టించారు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర‌లో జ‌ష్విక న‌టించింది. వారిద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ. కానీ దాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరు. మ‌రీ ముఖ్యంగా మ‌ల్లిబాబు అయితే ప‌లు సంద‌ర్భాల్లో సుజాత‌కు త‌న ప్రేమ‌ను చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించి చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఇద్ద‌రూ అనుకోని కార‌ణాల‌తో దూర‌మ‌వుతారు. మ‌రి వాళ్లిద్ద‌రూ క‌లుసుకున్నారా? అనేదే ‘తెలుసా మనసా’ సినిమా క‌థాంశం. తాజాగా ఈ సినిమాలోని ‘మనసు మనసుతో’ (Manasu Manasu Tho) అని సాగే మెలోడీ సాంగ్‌ను.. ‘వాల్తేరు వీర‌య్య‌’ (Waltair Veerayya)తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి (Bobby Kolli) విడుద‌ల చేసి.. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

‘‘మనసు మనసుతో కలిసి కరిగిన మౌనమేనా..

వినదు వినదుగా.. ఎవరి మనవిని కొంచమైనా..

ఎదలోన ఎదిగే మాటని.. పెదవంచు పైకి రమ్మని..

బతిమాలుతున్నా.. వినిపించుకోదే..’’ అంటూ సాగిన ఈ పాటను నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ (Gopi Sundar) స్వరపరచగా.. వనమాలి (Vanamali) సాహిత్యం అందించారు. సింగర్ శ్రీకృష్ణ (Sri Krishna) ఈ పాటని ఆలపించారు. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. నిజ‌మైన ప్రేమ‌లోని లోతును ఆవిష్క‌రించేలా, హృద‌యానికి హ‌త్తుకునేలా ఉందీ పాట. కాగా.. డెబ్యూ డైరెక్ట‌ర్ వైభ‌వ్ .. ‘తెలుసా మనసా..’ చిత్రాన్ని న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరిగా అద్భుతంగా మ‌లుస్తున్నార‌ని త్వ‌ర‌లోనే మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Updated Date - 2023-02-14T19:24:01+05:30 IST