మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది

ABN , First Publish Date - 2023-07-28T23:52:52+05:30 IST

‘చిత్ర పరిశ్రమలో ఓ నటుడికి, మేకప్‌ మేన్‌కు ఉన్న బంధం భార్యాభర్తల లాంటిది. నేను చిన్నప్పటినుంచి చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా చేయడం అంత సామాన్యమైన విషయం కాదు.

మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది

‘చిత్ర పరిశ్రమలో ఓ నటుడికి, మేకప్‌ మేన్‌కు ఉన్న బంధం భార్యాభర్తల లాంటిది. నేను చిన్నప్పటినుంచి చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆయన మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. కొత్త హీరో తేజకు అభినందనలు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. తేజ్‌ , రిషిక జంటగా స్వీయ దర్శకత్వంలో బొమ్మదేవర రామచంద్రరావు నిర్మించిన ‘మాధవే మధుసూదనా’ చిత్రం టీజర్‌ను గురువారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేసి, మాట్లాడారు విష్ణు. ‘క్రమశిక్షణ, నిబద్ధత కారణంగానే చంద్ర ఈ స్థాయికి ఎదిగారు. తన కుమారుడు తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ టీమ్‌కు అభినందనలు’ అన్నారు దామోదర ప్రసాద్‌ హీరో తేజ్‌ మాట్లాడుతూ‘ నాన్నగారి సంకల్పమే ఆయన్ని గొప్ప మేక్‌పమేన్‌గా చేసింది. అదే ఈ రోజు నన్నిక్కడ నిలబెట్టింది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’ అన్నారు. దర్శకనిర్మాత రామచంద్రరావు మాట్లాడుతూ ‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జునగారికి రుణపడి ఉంటాను. అలాగే మోహన్‌బాబుగారికి ఫోన్‌ చేయగానే నాకు అండగా ఉంటానని బెప్పారు. తను సింగపూర్‌లో ఉండడంతో రాలేనని చెప్పి, విష్ణును పంపించారు’ అన్నారు.

Updated Date - 2023-07-28T23:52:52+05:30 IST