Vijay Deverakonda: పెళ్లి మీద ఇష్టం పెరిగింది.. త్వరలోనే ఆ ఛాప్టర్‌లోకి..
ABN , First Publish Date - 2023-08-09T20:18:27+05:30 IST
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్‌గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఖుషి’ ఒక అమేజింగ్ ఫిల్మ్. క్యూట్ లవ్ ఫిల్మ్. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలను చూపించే అవకాశం దక్కుతోంది. ఇలాంటి టైమ్‌లో నేను హీరోగా ఉండటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. పరస్పరం అర్థం చేసుకోవడం, ప్రేమను పంచడం.. ఈ రెండు క్వాలిటీస్ జీవిత భాగస్వామికి ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు సపోర్ట్‌గా నిలవాలి. అప్పుడే బంధాలు నిలుస్తాయి. నాకు ఆ మధ్య ప్రేమ కథల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ‘ఖుషి’ కథ విన్న తర్వాత బ్యూటీఫుల్ ఫీల్ కలిగింది. మళ్లీ ప్రేమ కథల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. మేమంతా మణిరత్నం సార్ అభిమానులం. ఆయన సినిమాలను ఎంతో ఇష్టపడతాం. ఒకప్పుడు నా దగ్గర ఎవరూ పెళ్లి మాట ఎత్తేవారు కాదు. కానీ ఈ మధ్య నా స్నేహితులు పెళ్లి చేసుకోవడం, వాళ్ల జీవితాలు చూస్తుంటే నాకు పెళ్లి మీద అయిష్టం పోయింది. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఛాప్టర్. నేనూ ఆ ఛాప్టర్‌లోకి అడుగుపెడతా. (Vijay Deverakonda about His Marriage)
తమిళంలో నాకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిల్లర్ డైరెక్టర్ అరుణ్, వెట్రి మారన్, పా రంజిత్. అవకాశం వస్తే వాళ్లతో తప్పకుండా సినిమా చేస్తా. మలయాళంలోనూ నాకు సినిమాలు చేయాలని ఉంది. అయితే మలయాళం మాట్లాడటం వచ్చిన తర్వాత అక్కడ మూవీ చేస్తా. నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు. తెలిస్తే పాన్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకునేవాడిని. ఇప్పుడు బిజీగా మారా. నేర్చుకునే టైమ్ దొరకడం లేదు.
‘ఖుషి’ హాఫ్ పార్ట్ షూట్ చేసే టైమ్‌కు సమంత (Samantha)కు హెల్త్ బాగాలేదు. ఆమె కోసం ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా వెయిట్ చేద్దామని అనుకున్నాం. సమంత కోలుకుంటే చాలనుకున్నాం. ఒకవేళ తను క్యూర్ అయ్యేందుకు పదేళ్లు పట్టినా.. ఈ కథను మరోలా మార్చి.. పదేళ్ల తర్వాత సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమాకు సమంత చేసిన కాంట్రిబ్యూషన్ మాకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆమె వచ్చి సినిమా పూర్తి చేసింది. యాక్షన్ సినిమాలనే పాన్ ఇండియా కోసం ఎంచుకుంటారు. కానీ ఈ సినిమా మేము వివిధ రాష్ట్రాల్లో బాక్సాఫీస్ నెంబర్స్ చూపించేందుకు చేసింది కాదు. లవ్ అనేది అందరి లైఫ్‌లో ఒకటే. ఆ రూటెడ్ లవ్ స్టోరిని పాన్ ఇండియా వైజ్ చూపించాలని అనుకున్నాం. నాకు వెబ్ సిరీస్‌లు చేసే ఉద్దేశం లేదు. నాకు పేరు ముందు బిరుదులు పెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాలో ద విజయ్ దేవరకొండ (The Vijay Deverakonda) అని టైటిల్స్‌లో పెట్టామని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
***************************************
*Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్
***************************************
*Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?
***************************************
*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..
***************************************
*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!
***************************************
*Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..
***************************************