Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..
ABN , First Publish Date - 2023-05-09T15:49:24+05:30 IST
నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే’’ అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బర్త్ డే (మే 9) స్పెషల్‌గా ఆయన నటిస్తున్న ‘ఖుషి’ (Kushi) మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్‌ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. సమంత (Samantha) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేసేలా విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్‌గా విడుదలైన ఈ సాంగ్ కనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ (Hesham Abdul Wahab) స్వరపరిచి ఈ పాటను తనే పాడగా.. దర్శకుడు శివ నిర్మాణనే ఈ పాటకు సాహిత్యం అందించారు. అంతేకాదు.. ఈ పాటకు కొరియోగ్రఫీ కూడా ఆయనే చేయడం విశేషం.
ఈ పాటకు ఉన్న మరో విశేషం ఏమిటంటే.. ‘‘నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే’’ అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం. ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృత జడిలో ఓ ఘర్షణే మొదలైంది.., నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా..’ అంటూ చక్కని సాహిత్యంతో ఈ పాట నడిచింది. ఏ సినిమా నుంచి అయినా మొదటి పాట వస్తోందంటే అది ఆ మూవీ ఫ్లేవర్‌ను తెలియజేస్తుంది. ఇప్పుడీ సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనే సంకేతాలను ఇస్తోంది. ఈ పాటను కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లుగా ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. మొత్తంగా విజయ్ దేవరకొండకు, ఆయన ఫ్యాన్స్ పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ అనేలా ఈ సాంగ్ ఉంది. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Kushi First Lyrical Song)
ఇందులో సమంత ఓ కశ్మీరి యువతిగా కనిపిస్తోంది. తన ప్రేమను గెలుచుకునే యువకుడుగా విజయ్ నటించాడు. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని పాట చూస్తే అర్థమౌతోంది. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిన ‘ఖుషి’ (Kushi) చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న (Kushi Release Date) విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?
*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..
*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్
*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..
*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్ నుంచి ఊహించని ట్వీట్