Vijay Devarakonda: మా ఫ్యామిలీకి రెండు హిట్లు
ABN , First Publish Date - 2023-09-04T00:35:01+05:30 IST
ఈ ఏడాది మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. మా తమ్ముడు నటించిన ‘బేబి’, నేను నటించిన ‘ఖుషి’ చిత్రాలు హిట్ అయ్యాయి..
‘ఈ ఏడాది మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. మా తమ్ముడు నటించిన ‘బేబి’, నేను నటించిన ‘ఖుషి’ చిత్రాలు హిట్ అయ్యాయి. అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా కుటుంబ సభ్యులతో కలసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాను. మైత్రి సంస్థకు కూడా ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. వాళ్లు నిర్మించిన రెండు చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ‘ఖుషి’ హిట్ అయింది. మా లాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా’ అన్నారు విజయ్ దేవరకొండ. తను హీరోగా నటించిన ‘ఖుషి’ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో ఆయన తల్లితండ్రులు, తమ్ముడు ఆనంద్, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్‌తో కలసి ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.