Vikram Rathod: విజయ్ ఆంటోని సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.
ABN , First Publish Date - 2023-11-24T21:09:10+05:30 IST
విజయ్ ఆంటోని.. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ హీరోగానే కాకుండా పలు శాఖల్లో మంచి పేరును గడించారు. రీసెంట్‌గా విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు 2’ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే జోష్‌లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విక్రమ్ రాథోడ్’తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా విడుదలకానుంది.
విజయ్ ఆంటోని (Vijay Antony).. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ హీరోగానే కాకుండా పలు శాఖల్లో మంచి పేరును గడించారు. ప్రస్తుతం ఆయన కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో స్టార్ స్టేటస్‌కు చేరువలో ఉన్నారు. రీసెంట్‌గా విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు 2’ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే జోష్‌లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathod). ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో.. బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి ఈ సినిమాని నిర్మించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Music Maestro Ilayaraja) సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ఓం శివ గంగా ఎంటర్‌ప్రైజెస్ (K బాబు రావు), పీఎస్ఆర్ ఫిల్మ్స్ (జీపీఎస్ రెడ్డి) బ్యానర్లపై డిసెంబర్ 1న భారీ ఎత్తున విడుదలకానుంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ తరువాత ఈ సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ అవుతుందని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న నిర్మాతలు చెబుతున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత, ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ వంటివారు ఇతర పాత్రల్లో నటించారు. (Vikram Rathod Release Date)
ఇవి కూడా చదవండి:
====================
*Eagle: రవితేజ సినిమాకి ఇంకా 50 రోజులే..
********************************
*Akka: కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో రహస్యంగా YRF వెబ్ సిరీస్
*******************************
*Chandra Mohan: నాన్న ఎప్పుడూ ఏం చెప్పేవారంటే.. - చంద్రమోహన్ కుమార్తె
*******************************