Venki Kudumula : ఆ కష్టం ఎవరికీ రాకూడదు అంటూ భావోద్వేగ పోస్ట్‌..

ABN , First Publish Date - 2023-11-07T23:19:50+05:30 IST

‘‘రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కొవిడ్‌–19ను ఇప్పుడంతా మామూలు జ్వరంగా భావిస్తున్నారు. దానిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలాంటి తప్పు చేయవద్దు. అప్రమత్తంగా ఉండండి’’ అని దర్శకుడు వెంకీ కుడుముల సూచించారు.

Venki Kudumula : ఆ కష్టం ఎవరికీ రాకూడదు అంటూ భావోద్వేగ పోస్ట్‌..

‘‘రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కొవిడ్‌–19ను (Covid 19) ఇప్పుడంతా మామూలు జ్వరంగా భావిస్తున్నారు. దానిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలాంటి తప్పు చేయవద్దు. అప్రమత్తంగా ఉండండి’’ అని దర్శకుడు వెంకీ కుడుముల (Venki kudumula) సూచించారు. తన కుటుంబంలో జరిగింది ఎవరికీ జరగకూడదని ఆయన భావోద్వేగంతో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘గత కొన్ని వారాలుగా మా కజిన్‌ తరచూ జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరం అనుకుని అశ్రద్దతో సకాలంగా వైద్యుల్ని సంప్రదించలేదు. అది కాస్త అరుదైన జీబీ సిండ్రోమ్‌కు దారి తీసింది. అంటే మనిషిలోని రోగ నిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందించి ఉంటే, అది నయం అయ్యేది. డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఆలస్యం చేయడం జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. మా కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కరోనా తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. మన శరీరం సరైన స్థితిలో లేనప్పుడు త్వరగా జ్వరం బారిన పడతాం. అనారోగ్యానికి గురవుతాం. ఈ లక్షణాలను దయ చేసిన నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యం చేయించుకోండి. మనం తీసుకునే చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలే మన జీవితాల్ని కాపాడతాయి’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో గుర్తింపు పొందిన వెంకీ కుడముల నితిన్‌ – రష్మిక కాంబోలో ఇటీవల ఓ సినిమాను ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Updated Date - 2023-11-07T23:32:30+05:30 IST