Varun Tej: కమర్షియల్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నారు.. కానీ?

ABN , First Publish Date - 2023-08-22T20:26:36+05:30 IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఇది సమాజం కోసం తీసిన సినిమా అని వరుణ్ తేజ్ తెలిపారు.

Varun Tej: కమర్షియల్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నారు.. కానీ?
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు (Praveen Sattaru) ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SVCC) బ్యానర్‌ నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ‘గాండీవ‌ధారి అర్జున’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..


‘‘నాకు హాలీడే అన్నా, పండుగ అన్నా కూడా మా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజే. ఆయనకు అభిమానులందరి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా ఫస్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, నా చివరి దర్శకుడు అనిల్ రావిపూడి. నా ప్రజెంట్ డైరెక్టర్ ఇదే స్టేజ్ మీదున్నారు. నన్ను నటుడిగా తీర్చి దిద్దిన ప్రతీ ఒక్క దర్శకుడికి థాంక్స్. వెరైటీ సినిమాలు తీసిన ప్రతీ సారి కమర్షియల్ సినిమాలు తీసుకోవచ్చు కదా? అని సలహాలు ఇస్తుండేవారు. కానీ కొత్త కథలు చేయడమే నాకు ఇష్టం. సినిమా హిట్టైనా ఫ్లాపైనా నా ప్రయత్నం ఆగదు. ఆడియెన్స్ సపోర్ట్‌తో ఇంకా ఇలాంటి కొత్త కథలు చేస్తూనే ఉంటాను. సోషల్ మెసెజ్ ఉన్న సినిమాలు, అలాంటి కథలు అరుదుగా వస్తాయి. ఈ సినిమాలోని కోర్ పాయింట్ వల్లే ఒప్పుకున్నాను. (Varun Tej Speech)

Mega-Prince.jpg

ఎప్పుడూ మనం మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనల రావాలనే ఈ సినిమాను తీశాం. అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం. నిన్న రాత్రే ఈ సినిమాను చూశాను. మంచి సినిమా తీశామనే ఫీలింగ్ వచ్చింది. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత ‘తొలిప్రేమ’తో నాకు మంచి లవ్ స్టోరీని ఇచ్చారు. ‘విరూపాక్ష’తో హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాను తీశారు. టీం అంతా కూడా కష్టపడి పని చేసింది. నా మాటలు కాదు.. నా సినిమా, నా పని మాట్లాడాలి. ఆగస్ట్ 25న థియేటర్లోకి సినిమా రాబోతోంది. అందరూ చూడండి’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Jawan: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. 6గురు యాక్షన్ డైరెక్టర్స్.. ‘జవాన్’ రేంజ్ ఇది

***************************************

*Pawan Kalyan: అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

***************************************

*GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

***************************************

*Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?

***************************************

Updated Date - 2023-08-22T20:26:36+05:30 IST