ఈ తరానికి నచ్చే ఇద్దరు
ABN , First Publish Date - 2023-07-05T02:43:00+05:30 IST
అర్జున్ సర్జా, రాధికా కుమారస్వామి, జేడీ చక్రవర్తి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్. ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు....

అర్జున్ సర్జా, రాధికా కుమారస్వామి, జేడీ చక్రవర్తి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్. ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలె చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ ‘ఈ తరానికి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమాలో హీరో ఎవరు?, విలన్ ఎవరు? అనేది చివరి వరకూ ప్రేక్షకులు ఊహించలేరు. క్లైమాక్స్ సినిమాకు హైలెట్’ అన్నారు. ఫాతిమా మాట్లాడుతూ ‘అర్జున్, జేడీ చక్రవర్తి కథకు చక్కగా సరిపోయారు. యాక్షన్‌తో పాటు చక్కని వినోదాన్ని పంచే చిత్రమిది’ అన్నారు.