వచ్చే ఏడాది రెండు సినిమాలు
ABN , First Publish Date - 2023-12-18T01:32:06+05:30 IST
వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను అందుకొంటూ పాన్ ఇండియా హీరో గుర్తింపు సాధించారు అడివి శేష్. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో పాటు శ్రుతీహాసన్తో ఓ చిత్రం...
వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను అందుకొంటూ పాన్ ఇండియా హీరో గుర్తింపు సాధించారు అడివి శేష్. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో పాటు శ్రుతీహాసన్తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేష్ మీడియాతో మాట్లాడారు.
2023 మొత్తం ప్రిపరేషన్లోనే గడిచింది. ‘గూఢచారి 2’ తో పాటు శ్రుతీహాసన్తో కలసి చేస్తున్న చిత్రానికి రైటింగ్, పూర్వ నిర్మాణ పనుల కోసం చాలా పనిచేశాం. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి.
‘గూఢచారి 2’ చాలా పెద్దస్థాయిలో తెరకెక్కుతోంది. ఐదు దేశాల్లో జరిగే కథ. శ్రుతీహాసన్తో చేస్తున్న సినిమాను తెలుగు, హిందీ... రెండు భాషల్లో విడివిడిగా షూట్ చేయబోతున్నాం. కొత్త జానర్లో తెరకెక్కుతోంది. మంచి ప్రేమకథ, యాక్షన్ అంశాలు మిళితమై ఉంటాయి.
నేను మంచి యాక్టర్ని, అద్భుతమైన రచయితను, కానీ అంతగొప్ప దర్శకుణ్ణి మాత్రం కాదు అనుకుంటాను. అందుకే నటన, రచనకే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఈ రెండు చిత్రాల తర్వాత మరో రెండు సినిమాలు చేస్తున్నాను.