సినిమాగా చలం నవల
ABN , First Publish Date - 2023-09-10T00:58:22+05:30 IST
ప్రఖ్యాత రచయిత చలం నవల ‘సిగ్గు’ ఆధారంగా శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కొత్త చిత్రం ప్రారంభిస్తున్నారు...
ప్రఖ్యాత రచయిత చలం నవల ‘సిగ్గు’ ఆధారంగా శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కొత్త చిత్రం ప్రారంభిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇది తనకు 116వ చిత్రం అని ఆయన తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నరసింహ నంది తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని రామసత్యనారాయణ తెలిపారు.