ఈరోజే కలిశారు తొలిసారిగా...

ABN , First Publish Date - 2023-03-07T00:35:32+05:30 IST

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవిక నాయర్‌ కథానాయి...

ఈరోజే కలిశారు తొలిసారిగా...

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవిక నాయర్‌ కథానాయి. టీజీ విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మాతలు. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోమవారం టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి.. ఇవాళే కలిశారు తొలిసారిగా’ అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రాశారు. కల్యాణీ మాలిక్‌ స్వర పరిచారు. ఆయనతో పాటు నూతన మోహన్‌ ఈ గీతాన్ని ఆలపించారు. ‘‘ఇది నాయకా నాయికల పరిచయ గీతం. అబ్బాయి, అమ్మాయి ఎలా కలిశారు? కలిశాక ఏం జరిగింది? అనే విషయాల్ని పాటలో ప్రస్తావించాను. అవసరాల శ్రీనివాస్‌తో ‘జో అచ్యుతానంద’ తరవాత మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో మూడు పాటలు రాశా’’నన్నారు.

Updated Date - 2023-03-07T00:35:34+05:30 IST