Theatrical movies : ఈ వారం థియేటర్‌లో సందడి ఈ చిత్రాలదే!

ABN , Publish Date - Dec 18 , 2023 | 04:19 PM

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'సలార్‌' (Salaar) ఒకటి, ప్రభాస్‌ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రశాంత నీల్‌ తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్‌లో సందడి చేసేందకు రెడీ అయింది.

Theatrical movies : ఈ వారం థియేటర్‌లో సందడి ఈ చిత్రాలదే!

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'సలార్‌' (Salaar) ఒకటి, ప్రభాస్‌ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రశాంత నీల్‌ తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్‌లో సందడి చేసేందకు రెడీ అయింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో మొదటి భాగం ఈ నెల 22న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ఇతర పాత్రధారులు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ ‘సలార్‌’ను నిర్మించింది.

Movies.jpeg

షారుక్‌ఖాన్  హీరోగా రాజ్‌ కుమార్‌ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డంకీ’. (Dunki) షారుక్‌కు జోడీగా తాప్సీ నటిస్తోంది. క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 21 ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మించాయి.. ‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేేస ప్రయాణం’ అంటూ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రయాణంలో ఆ సైనికుడి స్నేహితులకు వచ్చిన ఆపద ఏంటి? దాన్ని నుంచి వాళ్లను ఎలా బయటపడేశాడు అన్నది తెలియాలంటే డంకీ చూడాల్సిందే అంటున్నారు షారుక్‌. ఈ ఏడాది షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ బద్దలుకొట్టారు. ‘డంకీ’తో హ్యాట్రిక్‌ ఖాయమని ధీమాగా చెబుతున్నారు.

Dunki.jpg

జాసన్‌ మోమోవా హీరగా జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘ఆక్వామెన్‌’. 2018లో విడుదలై బాక్సాఫీస్‌ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. జాసన్‌ ఈ చిత్రంలో ఆర్థర్‌ కర్రీ అనే పాత్రలోనే కనిపించనున్నారు. అట్లాంటిస్‌ రాజు అయిన తర్వాత ఆర్థర్‌ జీవితం ఎలా మారింది? ‘మాంటా’ ఆర్థర్‌ కుటుంబాన్ని, అట్లాంటిస్‌పై పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు? ఈ క్రమంలో అత్యంత శక్తిమంతుడైన మాంటాను తన సోదరుడితో కలిసి ఆర్థర్‌ ఏవిధంగా అడ్డుకున్నాడన్నది ఈ సినిమా ఇతివృత్తం.

Jasan.jpg

Updated Date - Dec 18 , 2023 | 04:19 PM