ఈసారి మిస్టర్‌ ఇడియట్‌

ABN , First Publish Date - 2023-07-10T00:45:12+05:30 IST

రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మిస్టర్‌ ఇడియట్‌’ అనే టైటిల్‌ ఖరారయింది...

ఈసారి మిస్టర్‌ ఇడియట్‌

రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మిస్టర్‌ ఇడియట్‌’ అనే టైటిల్‌ ఖరారయింది. సిమ్రాన్‌శర్మ హీరోయున్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌, ప్రీలుక్‌ను రవితేజ ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ‘ఇడియట్‌’ సినిమాకు ఎంత ప్రాముఖ్యం ఉందో తెలిసిందే. ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్‌కు కూడా ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి’ అని ఆకాంక్షించారు. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-07-10T00:45:12+05:30 IST