వర్షంలో కూడా థియేటర్లకు వస్తున్నారు
ABN , First Publish Date - 2023-07-23T03:00:40+05:30 IST
‘‘హిడింబ విషయంలో మేం అనుకొన్నవన్నీ జరిగాయి. నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. సినిమా కొన్నవాళ్లందరికీ మంచి డబ్బులు వస్తున్నాయ’’న్నారు అశ్విన్‌బాబు...
‘‘హిడింబ విషయంలో మేం అనుకొన్నవన్నీ జరిగాయి. నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. సినిమా కొన్నవాళ్లందరికీ మంచి డబ్బులు వస్తున్నాయ’’న్నారు అశ్విన్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిడింబ’. గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో అశ్విన్‌బాబు మాట్లాడుతూ ‘‘కుటుంబ ప్రేక్షకులు సైతం ఈ థ్రిల్లర్‌ని ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. విశ్రాంతి తరవాత వచ్చే సన్నివేశాల్ని ఎవరూ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ సీన్‌లోనే స్ర్కీన్ ప్లే టెక్నిక్ దాగుంద’’న్నారు. ‘‘రక్తాన్ని భయం లేకుండా చూపించిన సినిమా ఇది. వర్షాలు పడుతున్నా సరే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నార’’ని దర్శకుడు తెలిపారు.