పౌరాణిక ప్రేమకథకు ముహూర్తం ఖరారు
ABN , First Publish Date - 2023-01-03T00:23:05+05:30 IST
కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శాకుంతలం’. శకుంతల, దుష్యంత మహారాజుల అజరామరమైన...
కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శాకుంతలం’. శకుంతల, దుష్యంత మహారాజుల అజరామరమైన ఈ ప్రేమకథ ను దర్శకుడు గుణశేఖర్ తెరకు ఎక్కిస్తున్నారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత నీలిమ గుణ ప్రకటించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించడానికి ఈ సినిమాను 3డిలో విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగు సహా హిందీ , తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇండియన్ స్ర్కీన్ మీద ఇప్పటివరకూ రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమకథను భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు నీలిమ గుణ తెలిపారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈ సినిమాలో డాక్టర్ మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఈ చిత్రంలో యువరాజు భరతుడి పాత్రలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. దిల్ రాజు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ‘శాకుంతలం’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.