The Kashmir Files: ఆస్కార్ 2023 షార్ట్‌ లిస్ట్‌లో..

ABN , First Publish Date - 2023-01-10T20:24:42+05:30 IST

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఈ ఏడాది ఆస్కార్‌ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను

The Kashmir Files: ఆస్కార్ 2023 షార్ట్‌ లిస్ట్‌లో..
The Kashmir Files

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఈ ఏడాది ఆస్కార్‌ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కశ్మీర్ ఫైల్స్‌ (The Kashmir Files)తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి. ది కశ్మీర్ ఫైల్స్ జాబితాలోకి రావడం పట్ల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri) తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. “ది కశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కోసం TheAcademy చే షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఓటింగ్‌‌కు అర్హత పొందింది. ఎంపిక చేయబడిన 5 చిత్రాలలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిగతా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇండియన్ సినిమాకు ఇదొక గొప్ప సంవత్సరం. పల్లవి జోష్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ బెస్ట్ యాక్టర్స్‌ కేటగిరీలో షార్ట్ చేయబడినందుకు చాలా హ్యాపీ. ఇది ఆరంభం మాత్రమే.. ప్రయాణించాల్సింది ఇంకా చాలా ఉంది.. అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు. కాగా జనవరి 12 నుంచి 17వ తేదీ మధ్య ఓటింగ్ జరిపి.. జనవరి 24న ఆస్కార్ చివరి నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. మార్చి 12న హాలీవుడ్‌‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది.

‘ది కశ్మీర్ ఫైల్స్‌’ సినిమా విషయానికి వస్తే.. విడుదలైన తొలిరోజుల్లో సినిమాకు చాలా తక్కువ స్క్రీన్‌లు కేటాయించారు. అయితే, ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌‌గా నిలిచి, ఇండియన్ సినిమాలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ కథ 1990లలో భారత పాలిత కశ్మీర్ నుండి కాశ్మీరీ హిందువుల వలసలు, నాడు జరిగిన మారణహోమాన్ని చిత్రీకరించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal), వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి నిర్మించారు.

Updated Date - 2023-01-10T20:24:44+05:30 IST