చిన్న చిత్రాల వల్లే పరిశ్రమ బతుకుతోంది
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:12 AM
శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన ‘రాఘవరెడ్డి’ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. సంజీవ్‌కుమార్ మేగోటి దర్శకత్వంలో కెఎస్ శంకరరావు....
శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన ‘రాఘవరెడ్డి’ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. సంజీవ్‌కుమార్ మేగోటి దర్శకత్వంలో కెఎస్ శంకరరావు, జి.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల తేదిన ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘చిన్న చిత్రాల వల్లే పరిశ్రమ బతుకుతోంది. ‘రాఘవరెడ్డి’ వంటి చిన్న సినిమాల వల్లే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పరిశ్రమను బతికించుకోవడం కోసం ఇలాంటి చిత్రాలను విజయవంతం చేయాలి. ఇందులో హీరోగా నటించిన శివ కంఠమనేనికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. డబ్బు కోసం ఏనాడూ ఆయన సినిమాలు చేయలేదు. అన్ని జానర్లలో అద్భుతమైన సినిమాలు తీయగల సత్తా కలిగిన దర్శకుడు మేగోటి సంజీవ్ ఈ సినిమాను బాగా తీశారు’ అని అభినందించారు. ‘ఈ సినిమాలో నేను చేసిన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. కూతురే ప్రపంచంగా బతికే తల్లిగా నటించాను. పూర్తిగా సీరియ్‌సగా ఉండే పాత్ర ఇది’ అన్నారు రాశి. దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ ‘క్రిమినాలజీ ప్రొఫెసర్ రాఘవరెడ్డిగా శివ కంఠమనేని అద్భుతంగా నటించారు. ఆయన సరసన దేవకి పాత్రను రాశి బాగా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ చేతబట్టి ఈ సినిమా చేశాను. అందరినీ అలరించే సినిమా అవుతుంది’ అన్నారు. నిర్మాతగా తమకు ఇది మూడో సినిమా అనీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చి వెంటనే సినిమా ప్రారంభించామనీ నిర్మాత శంకరరావు చెప్పారు.