యుద్ధ వీరుడి కథ

ABN , First Publish Date - 2023-06-03T00:39:25+05:30 IST

నిఖిల్‌ కథానాయుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘స్వయంభూ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

యుద్ధ వీరుడి కథ

నిఖిల్‌ కథానాయుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘స్వయంభూ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో యుద్ధ వీరుడిగా నిఖిల్‌ కనిపించనున్నారు. ‘‘నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. సంగీతం: రవి బస్రూర్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు.

Updated Date - 2023-06-03T00:40:26+05:30 IST