‘జైలర్’ నుంచి సునీల్ లుక్ రిలీజ్
ABN , First Publish Date - 2023-01-18T01:33:09+05:30 IST
రజనీకాంత్ హీరోగా, యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్’ చిత్రం నుంచి సునీల్ లుక్‌ను మంగళవారం రిలీజ్ చేశారు...

రజనీకాంత్ హీరోగా, యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్’ చిత్రం నుంచి సునీల్ లుక్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది.. ఈ సినిమాలో సునీల్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉన్నట్టు ఈ పోస్టర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో రజనీకాంత్ జైలర్‌గా నటిస్తుండగా, రమ్యకృష్ణ, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, కోలీవుడ్ హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ ఉగాదికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.