Sudigali Sudheer: 30న ఓటేయండి.. 1న నా సినిమా చూడండి

ABN , First Publish Date - 2023-11-29T19:27:22+05:30 IST

బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టించింది. డిసెంబ‌ర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Sudigali Sudheer: 30న ఓటేయండి.. 1న నా సినిమా చూడండి
Sudigali Sudheer and Dollyshah

బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra). షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా (Arun Vikkirala) ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా (Dollyshah) హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, దర్శకుడు దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ (Sudigali Sudheer about Calling Sahasra) .. నాకు ఈ సినిమాలో మంచి పాత్రను, సవాల్‌తో కూడుకున్న పాత్రను ఇచ్చిన దర్శకుడు అరుణ్ గారికి థ్యాంక్స్. నాలోని ఇంకో కోణాన్ని చూపించే పాత్ర వచ్చింది. డాలీషాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆమె నటిస్తూ ఉంటే ఎంతో కాంపిటేటివ్‌గా అనిపిస్తుంది. మా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలా? అనుకుంటున్న టైంలోనే బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేశారు. మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేలా హెల్ప్ చేశారు.


Calling-Sahasra.jpg

గెటప్ శ్రీను అనే వాడు.. వేణు అన్న దగ్గరికి వెళ్లమని చెప్పకపోతే.. మల్లెమాల టీం, జబర్దస్త్ లేకపోతే.. ప్రేక్షకుల అభిమానం నాకు దక్కేది కాదు. వాళ్ల వల్లే అభిమానుల అభిమానం దొరికింది. ప్రేక్షకులకు, అభిమానులకు, అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేను. ‘గాలోడు’ సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది.. ఇప్పుడు మంచి చిత్రాలు ఇస్తే ఇంకా ప్రేమిస్తారు అని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారు. ఇకపై కొత్త కంటెంట్, మంచి సినిమాలు తీస్తాను. కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేశాం. సినిమా నచ్చితే పది మందికి చెప్పండి. 30వ తేదీ అందరూ ఓటు వేయండి.. 1వ తేదీ మా సినిమాను చూడండని తెలిపారు. (Calling Sahasra Pre Release Event)


ఇవి కూడా చదవండి:

====================

*Ram Charan: మైసూర్ నుంచి రామ్ చరణ్ రిటన్ వచ్చేశాడు.. ఎందుకంటే?

***********************************

*Telangana Elections: సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేస్తున్నారంటే..?

**********************************

*Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

*********************************

*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..

***********************************

Updated Date - 2023-11-29T19:27:24+05:30 IST