‘కబ్జా’ చేస్తున్న సుధాకరరెడ్డి
ABN , First Publish Date - 2023-02-01T23:12:55+05:30 IST
ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కబ్జా’ చిత్రం మార్చి 17న కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలవుతోంది...

ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కబ్జా’ చిత్రం మార్చి 17న కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలవుతోంది. స్వీయ దర్శకత్వంలో ఆర్. చంద్రు నిర్మించిన ఈ సినిమాను నిర్మాత ఎన్.సుధాకర రెడ్డి , ఆయన తనయుడు నితిన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సుధాకరరెడ్డి మాట్లాడుతూ ‘కన్నడ చిత్రాలు ‘కేజీఎఫ్’, ‘777 చార్లీ, విక్రాంత్ రోణ, కాంతారా పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఇప్పుడు అదే స్థాయిలో రూపుదిద్దుకొన్న కన్నడ చిత్రం ‘కబ్జా’. ఉపేంద్ర అద్భుతంగా నటించారు. 1947 నుంచి 1984 మధ్య కాలంలో నడిచే కథ ఇది. స్వాతంత్య్ర సమర యోధుడి తనయుడు మాఫియా వరల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడనే అంశంతో ఆర్.చంద్రు సినిమాను సూపర్‌గా తీశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కూడా సంచలనం సృష్టిస్తుంది’ అని చెప్పారు. శ్రియ, కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్ ,జగపతిబాబు , ప్రకాశ్‌రాజ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.