మెగాఫోన్ పడుతున్న విజయ్ వారసుడు
ABN , First Publish Date - 2023-08-29T03:06:40+05:30 IST
తమిళనాట స్టార్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకొన్నారు విజయ్. ఆయన తనయుడు జాసన్ సంజయ్ విజయ్ ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నారు...

తమిళనాట స్టార్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకొన్నారు విజయ్. ఆయన తనయుడు జాసన్ సంజయ్ విజయ్ ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నారు. జాసన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం విడుదల చేశారు. ‘‘కొత్త ఆలోచనలతో వచ్చే యువతరానికి ఆహ్వానం పలకడానికి మా సంస్థ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. సంజయ్ చెప్పిన పాయింట్ నచ్చింది. లండన్‌లో స్ర్కీన్ ప్లే రైటింగ్‌లో శిక్షణ పూర్తి చేశారు. టొరంటో ఫిల్మ్‌స్కూల్‌లో డిప్లామా కూడా చేశారు. సినిమా మేకింగ్‌పై ఆయనకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తార’’ని సుభాస్కరన్ తెలిపారు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం లైకా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో చేయడం ఆనందంగా ఉంద’’న్నారు జాసన్.