రామ్‌తో శ్రీలీల
ABN , First Publish Date - 2023-01-06T06:52:32+05:30 IST
రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోంది...

రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. గురువారం ఆమె సెట్‌లోకి అడుగుపెట్టారు. రామ్, శ్రీలీలపై కీలక సన్నివేశాలను బోయపాటి శ్రీను తెరకెక్కించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే